Samsung Galaxy Z Fold 8: శాంసంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ లీక్.. ఎలా ఉన్నాయంటే..?

శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేస్తుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఫోన్ జూలై 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 లేదా ఎక్సినోస్ 2600 ప్రాసెసర్‌తో పనిచేసే అవకాశం ఉంది.

Update: 2025-12-22 05:12 GMT

Samsung Galaxy Z Fold 8: శాంసంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ లీక్.. ఎలా ఉన్నాయంటే..?

Samsung Galaxy Z Fold 8 : శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేస్తుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఫోన్ జూలై 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 లేదా ఎక్సినోస్ 2600 ప్రాసెసర్‌తో పనిచేసే అవకాశం ఉంది. అదే సమయంలో 16జీబీ వరకు ర్యామ్ ప్లస్ 1టీబీ వరకు UFS 4.0 స్టోరేజ్‌తో వస్తుంది. అది కాకుండా 200MP మెుయిన్ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, టెలిఫోటో లెన్స్‌తో పాటు మెయిన్ కెమెరా అప్‌గ్రేడ్‌లను పొందుతుందని భావిస్తున్నారు. రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్ గురంచి వినిపిస్తున్న ఫీచర్లు, స్పెసిఫికేషన్లు అన్ని వివరాలు తెలుసుకుందాం.

శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 ఫోన్ జూలై 2026లో ప్రపంచ మార్కెట్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. 12జీబీ ర్యామ్ ప్లస్ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.1,99,999 నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అది కాకుండా 256జీబీ, 512జీబీ, లేదా 1టీబీ వరకు UFS 4.0 స్టోరేజ్ ఆప్షన్‌లతో పాటు 12జీబీ లేదా 16జీబీ ర్యామ్ ఆప్షన్‌లను ఉంటాయనే టాక్ వినిపిస్తోంది.

శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 ఫోన్ గ్లోబల్ వేరియంట్‌ల కోసం మెరుగైన పవర్ ఎఫిషియెన్సీ, పనితీరు కోసం 2ఎన్ఎమ్ సిస్టమ్‌పై బిల్డ్ చేసిన నెక్స్ట్ జనరేషన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌ ఉంటుందని భావిస్తున్నారు. దక్షిణ కొరియా వెర్షన్ కోసం ఇంటర్నల్‌గా తయారు చేసిన ఎక్సినోస్ 2600 ప్రాసెసర్‌ ఉంటుంది. అదే సమయంలో ఇది ఆండ్రాయిడ్ 17, వన్ UI 9పై పనిచేస్తుందని భావిస్తున్నారు.

శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 ఫోన్ 120 Hz రిఫ్రెష్ రేట్ , 2600 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో 8.2-అంగుళాల ఎల్‌టీపీఓ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ సిరామిక్ 2 ప్రొటక్షన్‌తో 6.56-అంగుళాల అమోలెడ్ కవర్ స్క్రీన్‌ను కూడా పొందచ్చు.

ఈ ఫోన్ సన్నగా, తేలికగా ఉండే బాడీతో వస్తుందని కూడా లీక్స్ సూచిస్తున్నాయి. స్క్రీన్ మడతను తగ్గించడానికి శాంసంగ్ కొత్త మైక్రో-బ్లేడ్ డిస్‌ప్లే టెక్నాలజీ, లేజర్-డ్రిల్డ్ మెటల్ ప్లేట్‌లపై పనిచేస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయి. ఎస్ పెన్ సపోర్ట్ తిరిగి రాబోతోందని, బహుశా కొత్త డిజైన్ ,సన్నని స్టైలస్‌తో వస్తుందని కూడా కథనాలు చెబుతున్నాయి.

శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 వెనుక భాగంలో, 200MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా , 3× ఆప్టికల్ జూమ్‌తో కూడిన 12MP టెలిఫోటో లెన్స్ ఉంటాయని అంచనా. ముందు భాగంలో కవర్, ప్రధాన డిస్‌ప్లేలపై డ్యూయల్ 12MP సెల్ఫీ కెమెరాలు ఉండచ్చు. ఈ ఫోన్‌లో 4800 mAh బ్యాటరీ ప్యాక్ ఉంటుందని కూడా అంచనా. ఈ బ్యాటరీ 25W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్, 4.5W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Sశాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 స్మార్ట్‌ఫోన్ జూలై 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది., 200MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా , 3× ఆప్టికల్ జూమ్‌తో కూడిన 12MP టెలిఫోటో లెన్స్ ఉంటాయని అంచనా.

Tags:    

Similar News