Power Bank Guide : కొత్త పవర్ బ్యాంక్ కొంటున్నారా? ముందు ఇవి తెలుసుకోండి.. లేకపోతే డివైస్‌కు నష్టం తప్పదు..!
Power Bank Guide : కొత్త పవర్ బ్యాంక్ కొంటున్నారా? ముందు ఇవి తెలుసుకోండి.. లేకపోతే డివైస్‌కు నష్టం తప్పదు..!
పవర్ బ్యాంక్ ఇప్పుడు సాధారణంగా ప్రతి ఒక్కరి దగ్గర ఉండే అవసరమైన గాడ్జెట్. టూర్లు, ప్రయాణాలు, ఎమర్జెన్సీ ఛార్జింగ్ కోసం ఇది తప్పనిసరి అయిపోయింది. అయితే మార్కెట్లో ఎన్నో రకాల పవర్ బ్యాంకులు ఉన్నా, అందరూ సరైనదే ఎంచుకుంటారన్న గ్యారంటీ లేదు. అసలైన సమస్య అదే. మీ ఫోన్‌కు సపోర్ట్ చేయని పవర్ బ్యాంక్‌ను ఎంచుకుంటే, అది ఛార్జింగ్ ఇవ్వదు మాత్రమే కాకుండా ఫోన్ బ్యాటరీకే డ్యామేజ్ వచ్చే అవకాశం ఉంటుంది.
కాబట్టి కొత్త పవర్ బ్యాంక్ కొనుగోలు చేసే ముందు కొన్ని ముఖ్యమైన అంశాలు ఖచ్చితంగా చెక్ చేయాలి. వోల్టేజ్ అవుట్‌పుట్, ఛార్జ్ కెపాసిటీ, బ్యాటరీ టైప్, సేఫ్టీ ఫీచర్లు, పోర్ట్‌ల సంఖ్య, క్వాలిటీ మెటీరియల్, పవర్ ఇండికేటర్ వంటి వివరాలు తప్పకుండా గమనించాలి.
5 వోల్ట్‌లకు మించిన ఫోన్‌లకు పవర్ బ్యాంక్ కూడా తగిన వోల్టేజ్‌ను అందించగలగాలి. ఫోన్ కెపాసిటీ కన్నా రెండింతలు లేదా మూడింతలు ఉన్న mAh సామర్థ్యం ఉండాలి. BIS సర్టిఫికేషన్ ఉన్న లిథియం అయాన్ లేదా పాలిమర్ సెల్ ఉండే బ్యాంక్‌లే బెటర్. అంతేగాక మల్టిపుల్ పోర్ట్‌లు, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అవసరం.
పవర్ ఇండికేటర్ ఉన్న మోడల్స్ ఉపయోగించాల్సిన సమయంలో ఎంత ఛార్జ్ ఉందో తెలుపుతాయి. అలాగే ఓవర్ ఛార్జింగ్, షార్ట్ సర్క్యూట్ వంటి ప్రమాదాల నుంచి కూడా డివైజ్‌ను రక్షిస్తాయి.
సేఫ్టీ, డ్యూరబిలిటీ, పనితీరు వంటి అన్ని కోణాల్లో మీకు ఉపయోగపడేలా ఉండే పవర్ బ్యాంక్‌నే ఎంచుకోండి. లేకపోతే తక్కువ ధరకే కొన్న డివైజ్ మీ ఫోన్‌కు పెద్ద నష్టమే చేసేస్తుంది.