Oppo Reno 15 Series: ఒప్పో యూజర్లకు సర్‌ప్రైజ్.. కిర్రాక్ స్మార్ట్‌ఫోన్స్ వచ్చేస్తున్నాయ్..!

Oppo తన కొత్త Reno 15 సిరీస్‌ను తైవాన్ మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో Reno 15, Reno 15 Pro, Reno 15 Pro Max అనే మూడు స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి.

Update: 2026-01-02 13:30 GMT

Oppo Reno 15 Series: ఒప్పో యూజర్లకు సర్‌ప్రైజ్.. కిర్రాక్ స్మార్ట్‌ఫోన్స్ వచ్చేస్తున్నాయ్..!

Oppo Reno 15 Series: Oppo తన కొత్త Reno 15 సిరీస్‌ను తైవాన్ మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో Reno 15, Reno 15 Pro, Reno 15 Pro Max అనే మూడు స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. ప్రీమియం డిజైన్‌తో పాటు ఆధునిక హార్డ్‌వేర్ ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్లు, 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన AMOLED డిస్‌ప్లేలు, 50MP సెల్ఫీ కెమెరా, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లతో ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా మూడు మోడళ్లకూ IP69 రేటింగ్ అందించడం వల్ల నీరు, ధూళి నుంచి మెరుగైన రక్షణ లభిస్తుంది. ఇవన్నీ Android 16 ఆధారిత ColorOS 16పై పనిచేస్తాయి.

Oppo Reno 15 Pro Max

ఈ సిరీస్‌లో టాప్ మోడల్‌గా వచ్చిన Oppo Reno 15 Pro Maxలో 6.78 అంగుళాల అమోలెడ్ ఫుల్ HD+ డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, అధిక పిక్సెల్ డెన్సిటీతో ఈ స్క్రీన్ మల్టీమీడియా అనుభవాన్ని మరింత మెరుగ్గా అందిస్తుంది. ఇక పనితీరు విషయంలో మీడియాటెక్ డెమెన్సిటీ 8450 ప్రాసెసర్, 12GB RAM, 512GB స్టోరేజ్‌తో ఇది శక్తివంతంగా నిలుస్తుంది. కెమెరా సెక్షన్‌లో 200MP మెయిన్ సెన్సార్‌తో పాటు పెరిస్కోప్ టెలిఫొటో లెన్స్, అల్ట్రా వైడ్ లెన్స్ ఉన్నాయి. ముందు భాగంలో 50MP కెమెరా ఇచ్చారు. పెద్ద 6500mAh బ్యాటరీతో పాటు 80W వైర్డ్, 50W వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

ఇక Reno 15 Pro మోడల్‌లో 6.32 అంగుళాల అమోలెడ్ ఫుల్ HD+ డిస్‌ప్లేను అందించారు. దీనిలో కూడా డెమెన్సిటీ 8450 చిప్‌సెట్, 12GB RAM, 256GB స్టోరేజ్ లభిస్తుంది. 6200mAh బ్యాటరీతో 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం ఈ ఫోన్ ప్రత్యేకత. ఇక స్టాండర్డ్ Reno 15 మోడల్‌లో 6.59 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్, 12GB ర్యామ్‌తో గరిష్టంగా 512GB స్టోరేజ్ ఆప్షన్ ఉంది. ఈ ఫోన్‌లో కూడా 6500mAh బ్యాటరీని ఇచ్చారు. ఈ రెండు మోడళ్లలోనూ 50MP ఫ్రంట్ కెమెరా, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో పాటు IP69 రేటింగ్ అందించారు.

ధరల విషయానికి వస్తే.. ఒప్పో రెనో 15 ప్రో మ్యాక్స్ తైవాన్‌లో సుమారు రూ.71,000 దరకు లాంచ్ అయ్యింది. ఈ మోడల్ ట్విలైట్ గోల్డ్, డెసర్ట్ బ్రౌన్ రంగుల్లో లభిస్తుంది. రెనో 15 ప్రో ధర సుమారు రూ.60,000 ఉండగా.. ఇది అరోరా బ్లూ, డెసర్ట్ బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఇక రెనో 15 స్టాండర్డ్ మోడల్ 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ సుమారు రూ.51,000 ధరకి, 12GB + 512GB వేరియంట్ రూ.55,000 ధరకి విడుదలైంది. ఈ ఫోన్ అరోరా వైట్, స్కై బ్లూ రంగుల్లో లభిస్తుంది.

Tags:    

Similar News