OPPO Reno 15 Pro Mini: ఒప్పో మిని స్మార్ట్‌పోన్.. మరికొన్ని రోజుల్లో మార్కెట్లోకి.. ఫీచర్లు చూశారా..?
ఒప్పో తన ఒప్పో రెనో 15 ప్రో మినీ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో చైనాలో డిసెంబర్ 2025 చివరిలో లేదా జనవరి 2026లో ఆవిష్కరించబోతోంది.
OPPO Reno 15 Pro Mini: ఒప్పో మిని స్మార్ట్‌పోన్.. మరికొన్ని రోజుల్లో మార్కెట్లోకి.. ఫీచర్లు చూశారా..?
OPPO Reno 15 Pro Mini: ఒప్పో తన ఒప్పో రెనో 15 ప్రో మినీ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో చైనాలో డిసెంబర్ 2025 చివరిలో లేదా జనవరి 2026లో ఆవిష్కరించబోతోంది. ఈ ఫోన్ దేశీయ వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 8450 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని, గ్లోబల్ వేరియంట్లలో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్‌ను పొందే అవకాశం ఉందని విస్తృతంగా సమాచారం జరుగుతుంది. అదే సమయంలో ఇది 200MP మెయిన్ కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
OPPO Reno 15 Pro Mini Display
ఒప్పో రెనో 15 ప్రో మినీ స్మార్ట్‌ఫోన్ సుమారు 7.99 మిమీ సన్నని ప్రొఫైల్, దాదాపు 187 గ్రాముల బరువుతో కాంపాక్ట్ ఫోన్‌గా రూపొందించనున్నారు. ఈ ఫోన్ 120 Hz రిఫ్రెష్ రేట్, సన్నని బెజెల్స్‌తో కూడిన 6.32-అంగుళాల అమోలెడ్ స్క్రీన్ ఉంటుందని అంచనా. ఇది 1.5K రిజల్యూషన్ , దుమ్ము, నీటి నిరోధకత కోసం IP66, IP67, IP69 రేటింగ్‌లతో ఉంటుంది. అలానే గ్లాస్ బ్యాక్ ప్యానెల్‌తో ప్రీమియం డిజైన్ కూడా ఉంటుంది.
OPPO Reno 15 Pro Mini Camera
ఒప్పో రెనో 15 ప్రో మినీ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో హై క్వాలిటీ ఫోటోలను క్యాప్చర్ చేయడానికి మంచి కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 200MP మెయిన్ సెన్సార్ (బహుశా శాంసంగ్ HP5 సెన్సార్), దీనితో పాటు 50MP అల్ట్రా-వైడ్ లెన్స్, 3.5× ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి.
ఇక ముందు భాగంలో 4K వీడియో రికార్డింగ్ చేయగల 50MP సెల్ఫీ కెమెరాను పొందచ్చు. అది కాకుండా, ఈ ఫోన్‌లో 6300 mAh నుండి 6500 mAh బ్యాటరీ ప్యాక్ కలిగి ఉండచ్చు .ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇది 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుందని లీక్స్ సూచిస్తున్నాయి.
OPPO Reno 15 Pro Mini Processor
ఒప్పో రెనో 15 ప్రో మినీ స్మార్ట్‌ఫోన్ చైనీస్ వేరియంట్ కోసం మీడియాటెక్ డైమెన్సిటీ 8450 చిప్‌సెట్, గ్లోబల్ వేరియంట్ కోసం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని భావిస్తున్నారు. ఇది 128GB లేదా 256GB UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజ్‌తో పాటు 8GB లేదా 12GB RAM ఆప్షన్‌లతో రాబోతోంది. అది కాకుండా, ఇది కలర్‌ఓఎస్ 16 ఆధారిత ఆండ్రాయిడ్ 16తో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.