Moto X70 Air Pro: మోటరోలా నుంచి మరో స్మార్ట్‌ఫోన్.. లాంచ్ అయితే సంచలనమే..!
Moto X70 Air Pro: మోటరోలా పేరు వినగానే ఒక ప్రత్యేకమైన గుర్తింపు గుర్తుకు వస్తుంది. ఫోన్ డిజైన్ దగ్గర నుంచి బిల్డ్ క్వాలిటీ వరకు తనదైన స్టైల్ చూపించే బ్రాండ్ ఇది.
Moto X70 Air Pro: మోటరోలా నుంచి మరో స్మార్ట్‌ఫోన్.. లాంచ్ అయితే సంచలనమే..!
Moto X70 Air Pro: మోటరోలా పేరు వినగానే ఒక ప్రత్యేకమైన గుర్తింపు గుర్తుకు వస్తుంది. ఫోన్ డిజైన్ దగ్గర నుంచి బిల్డ్ క్వాలిటీ వరకు తనదైన స్టైల్ చూపించే బ్రాండ్ ఇది. తాజాగా మోటరోలా మరోసారి టెక్ ప్రపంచంలో ఆసక్తి పెంచేలా కొత్త సూపర్ థిన్ ఫోన్‌ను టీజ్ చేసింది. ఇప్పటికే 2025 అక్టోబర్‌లో చైనాలో లాంచ్ అయిన మోటో ఎక్స్70 ఎయిర్ తర్వాత, ఇప్పుడు దానికంటే హైఎండ్ మోడల్‌గా మోటో ఎక్స్70 ఎయిర్ ప్రో త్వరలో రానున్నట్టు అధికారిక టీజర్ ద్వారా కన్ఫర్మ్ అయింది. ఈ టీజర్ చూసిన వెంటనే ఫోన్ లవర్స్ మధ్య చర్చ మొదలైంది.
తాజా టీజర్ పోస్టర్‌లో మోటరోలా స్పష్టంగా మోటో ఎక్స్70 ఎయిర్ ప్రో అనే పేరునే ఉపయోగించింది. ఈ మోడల్ చైనాలో త్వరలో లాంచ్ అవుతుందని కంపెనీ సూచించింది. లాంచ్ డేట్ ఇంకా బయటకు రాలేదు కానీ, టీజర్‌లో కనిపిస్తున్న ప్రధాన అంశం మాత్రం థిన్ అండ్ లైట్ డిజైన్. మోటో ఎక్స్70 ఎయిర్ ఎంత సన్నగా ఉందో, అదే లైన్‌లో ఈ ప్రో మోడల్ కూడా ఉండబోతుందని అర్థమవుతోంది. అదనంగా ఇందులో ఏఐ పవర్డ్ ఫీచర్లు ఉంటాయని కూడా మోటరోలా హింట్ ఇచ్చింది.
మోటో ఎక్స్70 ఎయిర్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‌లో ఎడ్జ్ 70 అనే పేరుతో వచ్చింది. ఆ ఫోన్ డిజైన్ పరంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఎయిర్ ప్రో అంటే కేవలం డిజైన్ మాత్రమే కాదు, లోపల కూడా హైఎండ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. అంటే ఇది సాధారణ అప్గ్రేడ్ కాదు, పూర్తిగా ప్రీమియం సెగ్మెంట్ టార్గెట్ చేసిన మోడల్ అని చెప్పొచ్చు. ఇటీవల మోటరోలా ఒక ప్రీమియం ఫోన్‌ను సిగ్నేచర్ అనే పేరుతో తీసుకురాబోతోందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ సిగ్నేచర్ ఫోన్ అసలు ఎడ్జ్ 70 అల్ట్రాకి కొత్త పేరు కావచ్చని టెక్ లీకులు చెబుతున్నాయి. అదే లాజిక్ చూస్తే, చైనాలో వచ్చే మోటో ఎక్స్70 ఎయిర్ ప్రో అనేది ఇదే సిగ్నేచర్ ఫోన్‌కు రీబ్రాండెడ్ వెర్షన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అంటే ఒకే ఫోన్, వేర్వేరు మార్కెట్లకు వేర్వేరు పేర్లు.
లీక్ అయిన బెంచ్‌మార్క్ వివరాల ప్రకారం ఈ ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ చిప్ ఇప్పటికే గీక్‌బెంచ్ లిస్టింగ్‌లో కనిపించింది. అంటే పర్‌ఫార్మెన్స్ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టంగా తెలుస్తోంది. ఈ ప్రాసెసర్‌తో పాటు 16 జీబీ ర్యామ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మోటో ఎక్స్70 ఎయిర్ ప్రో ఫోన్ నేరుగా ఆండ్రాయిడ్ 16 మీద రన్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. కొత్త ఆండ్రాయిడ్ వెర్షన్ అంటే మెరుగైన సెక్యూరిటీ, స్మూత్ యూజర్ ఎక్స్‌పీరియన్స్, ఇంకా ఏఐ ఆధారిత ఫీచర్లు ఎక్కువగా ఉండే అవకాశం. మోటరోలా క్లిన్ యూఐకి ఇది మరో ప్లస్ పాయింట్ అవుతుంది.
ఈ ఫోన్ ముందు భాగంలో 6.7 అంగుళాల ఫ్లాట్ ఓఎల్ఈడి డిస్‌ప్లే ఉండొచ్చని టెక్ లీకులు చెబుతున్నాయి. 1.5కే రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో ఈ స్క్రీన్ వస్తే విజువల్ ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుంటుంది. వీడియోలు చూడడం, గేమింగ్ చేయడం, సోషల్ మీడియా స్క్రోలింగ్ అన్నీ కూడా స్మూత్‌గా ఉండేలా ఈ డిస్‌ప్లే డిజైన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఫోటోగ్రఫీ ప్రేమికులకు ఈ ఫోన్ మంచి ఆప్షన్ అయ్యేలా ఉంది. వెనుక భాగంలో మూడు 50 మెగాపిక్సెల్ కెమెరాలు ఉండే అవకాశం ఉందని సమాచారం. మోటరోలా కెమెరా ట్యూనింగ్ ఇటీవల మెరుగుపడింది కాబట్టి, ఈ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో ఫోటోలు, వీడియోలు రెండింట్లోనూ మంచి రిజల్ట్ ఆశించవచ్చు.
సన్నని ఫోన్ అంటే బ్యాటరీ చిన్నగా ఉంటుందనే భయం చాలామందికి ఉంటుంది. కానీ మోటరోలా ఈసారి పెద్ద బ్యాటరీ ప్యాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్టు లీకులు చెబుతున్నాయి. స్లిమ్ డిజైన్‌తో పాటు తగినంత బ్యాటరీ బ్యాకప్ ఇవ్వగలిగితే, మోటో ఎక్స్70 ఎయిర్ ప్రో నిజంగా మార్కెట్‌లో స్ట్రాంగ్ ప్లేయర్ అవుతుంది. చైనాలో ముందుగా లాంచ్ అయిన తర్వాత, ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్‌లో కూడా రావొచ్చని అంచనా. సిగ్నేచర్ లేదా ఎడ్జ్ 70 అల్ట్రా అనే పేరుతో ఇండియాలో 2025 డిసెంబర్ 28న అనౌన్స్ చేసే అవకాశముందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. అధికారిక ప్రకటన వచ్చే వరకు పూర్తి క్లారిటీ లేదు కానీ, ఇండియా యూజర్లకు మాత్రం ఈ ఫోన్‌పై ఆసక్తి పెరుగుతోంది. అధికారిక లాంచ్ డేట్, ధర వివరాలు బయటకు వస్తే అసలు పిక్చర్ పూర్తిగా క్లియర్ అవుతుంది.