Honor Win RT: రెండు సూపర్ గేమింగ్ ఫోన్స్ లాంచ్ చేసిన హానర్..!

Honor Win RT: చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హానర్.. కొత్తగా పెర్ఫామెన్స్ ఫోకస్డ్ హానర్ విన్ సిరీస్‌ను అధికారికంగా లాంచ్ చేసింది.

Update: 2025-12-26 12:30 GMT

Honor Win RT: చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హానర్.. కొత్తగా పెర్ఫామెన్స్ ఫోకస్డ్ హానర్ విన్ సిరీస్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో హానర్ విన్, హానర్ విన్ RT అనే రెండు స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. రెండూ గేమింగ్ పవర్, లాంగ్ బ్యాటరీ లైఫ్, బలమైన థర్మల్ కంట్రోల్‌ ఫీచర్స్ పై దృష్టి పెట్టాయి. రెండు ఫోన్లలోనూ భారీ 10,000mAh బ్యాటరీ హైలైట్. లాంగ్ గేమింగ్ సెషన్లలో స్టేబుల్ పెర్ఫామెన్స్ కోసం బిల్ట్-ఇన్ యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్ జత చేశారు.

ప్రీమియం డిజైన్, స్మూత్ డిస్‌ప్లే

హానర్ విన్, విన్ RT రెండింటిలోనూ ఒకే ప్రీమియం డిజైన్ ఉంది. భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ రెండూ సుమారు 8.3mm మందం మాత్రమే. సాలిడ్ మెటల్ ఫ్రేమ్, గ్లాస్-ఫైబర్ రియర్ ప్యానెల్ ఉన్నాయి. ఫ్రంట్‌లో 6.83 అంగుళాల ఫ్లాట్ LTPS OLED డిస్‌ప్లే ఉంది. 1.5K రిజల్యూషన్ (2800 x 1272 పిక్సెల్స్) ఇస్తుంది. అల్ట్రా-స్మూత్ 185Hz రిఫ్రెష్ రేట్, 480Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి. గేమింగ్ రెస్పాన్స్ వేగవంతమవుతుంది. ఐ సెక్యూరిటీ (కంటి భద్రత) కోసం 5920Hz వరకు PWM డిమ్మింగ్ ఉంది. గేమింగ్ కంఫర్ట్ మోడ్స్, ప్రయాణం వేళ వినియోగానికి హై పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి.

హానర్ విన్ సిరీస్ పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8-సిరీస్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్లపై రన్ అవుతుంది. హానర్ విన్‌లో 5th జెనరేషన్ స్నాప్‌డ్రాగన్ 8 అల్ట్రా మొబైల్ ప్లాట్‌ఫామ్ ఉంది. విన్ RTలో కూడా స్నాప్‌డ్రాగన్ 8 అల్ట్రా చిప్‌సెట్ ఉంది. LPDDR5X ర్యామ్, యూఎఫ్‌ఎస్ 4.1 స్టోరేజ్ ఉన్నాయి. ఫాస్ట్ పెర్ఫామెన్స్, స్మూత్ మల్టీటాస్కింగ్, స్టేబుల్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది.

రెండు స్మార్ట్‌ఫోన్లలోనూ 10,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉంది. హెవీ గేమింగ్, లాంగ్ డైలీ యూసేజ్‌కు ఎక్సలెంట్ ఎండ్యూరెన్స్ ఇస్తుందని హానర్ క్లెయిమ్ చేసింది. 100w వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. హానర్ విన్‌లో అదనంగా 80w వైర్‌లెస్ ఛార్జింగ్, 27w వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ ఉన్నాయి. ఫోన్ వెనుకభాగంలో కూలింగ్ ఫ్యాన్ హీట్ కంట్రోల్ చేస్తుంది.

హానర్ విన్ సిరీస్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత మ్యాజిక్‌ OSపై రన్ అవుతుంది. మల్టిపుల్ ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్స్, ఎక్స్‌టెండెడ్ సెక్యూరిటీ అప్‌డేట్స్ హామీ ఇచ్చింది. రెండు ఫోన్లలోనూ 50MP ఫ్రంట్ కెమెరా ఉంది. హానర్ విన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా (50MP మెయిన్, 50MP టెలిఫోటో, 12MP అల్ట్రా-వైడ్) ఉంది. విన్ RTలో డ్యూయల్ రియర్ కెమెరా (50MP మెయిన్, 12ఎంపీ అల్ట్రా-వైడ్) ఉంది.

రెండు ఫోన్లలోనూ 3D అల్ట్రాసానిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు హానర్ ఏఐ సరౌండ్ సౌండ్ టెక్నాలజీతో వస్తాయి. 5G, వై-ఫై 7, బ్లూటూత్, జీపీఎస్, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ, డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉన్నాయి. IP68, IP69, IP69K రేటింగ్స్‌తో డస్ట్, వాటర్, హై-ప్రెషర్ వాషింగ్ ప్రొటెక్షన్ కలిగి ఉంది. హానర్ విన్ సిరీస్ ఫాస్ట్ బ్లాక్, విన్నింగ్ సిల్వర్, బ్లూ కలర్లలో అందుబాటులో ఉంది. చైనాలో హానర్ అధికారిక ఛానెల్స్ ద్వారా సేల్‌లో ఉంది.

Tags:    

Similar News