Flipkart Mobile Offers: అదిరే ఆఫర్.. గూగుల్ పిక్సెల్ 8పై రూ.26 వేల డిస్కౌంట్

Update: 2025-01-22 15:54 GMT

Flipkart Mobile Offers: అదిరే ఆఫర్.. గూగుల్ పిక్సెల్ 8పై రూ.26 వేల డిస్కౌంట్

Flipkart Mobile Offers: ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. ఫోన్ 128GB వేరియంట్‌పై ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లోని లిస్టింగ్ ప్రకారం..స్మార్ట్‌ఫోన్ రూ. 26,000 ఫ్లాట్ తగ్గింపును ఇస్తుంది.  దీంతో పిక్సెల్ ఫోన్ ధర రూ. 49,999కి వినియోగదారులకు అందుతుంది. అయితే మీరు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి EMI లావాదేవీపై స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే మీకు అదనంగా రూ. 3,000 తగ్గుతుంది. ఈ  ఆఫర్‌లతో ఈ ఫోన్ ధర రూ.46,999లకే లభించనుంది.

ఇది కాకుండా రూ. 35,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి, ఇవి ఫోన్ ధరను మరింత తగ్గిస్తాయి. అలానే కంపెనీ Pixel 7 స్మార్ట్‌పోన్‌పై అద్భుతమైన ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను అందిస్తోంది. మీరు ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ. 13,365 వరకు ఆదా చేసుకోవచ్చు.

అంటే మీరు ఈ ఎక్స్‌ఛేంజ్ వాల్యూ పొందితే ఫోన్ ధర దాదాపు రూ. 33,000గా ఉంటుంది. మీకు పాత స్మార్ట్‌ఫోన్ ఉంటే దానిని ఫార్మాట్,  ఫ్యాక్టరీ రీసెట్ చేసి, దాని నుండి మీకు అవసరమైన మొత్తం డేటాను సేవ్ చేసుకొని ఆపై ఎక్స్‌ఛేంజ్ చేయండి. 

ఆగస్ట్ 2024లో గూగుల్ పిక్సెల్ 8 సిరీస్,  పిక్సెల్ 7ఎ ధరల తగ్గింపును అధికారికంగా ప్రకటించింది. ముఖ్యంగా పిక్సెల్ 8 ధర గణనీయంగా తగ్గింది. దీని బేస్ వేరియంట్ 128GB భారతదేశంలో రూ.75,999కి ప్రారంభించారు. దీని ధరను తర్వాత రూ.71,999కి మార్చారు. ఫోన్ 256GB మోడల్ ధర ఇంతకుముందు రూ. 82,999. అయితే ధర తగ్గింపు తర్వాత దాని ధర రూ.77,999కి చేరుకుంది.

Similar News