Distilled Water vs Tap Water: ఇన్వర్టర్‌ బ్యాటరీలో డిస్టిల్డ్‌ వాటర్‌ కాకుండా తాగే నీరు పోస్తే ఏం జరుగుతుంది..!

Distilled Water vs Tap Water: ఇన్వర్టర్ బ్యాటరీలో తాగునీటిని పోయవచ్చని కొందరు అనుకుంటారు కానీ అలా చేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Update: 2024-03-23 05:44 GMT

Distilled Water vs Tap Water: ఇన్వర్టర్‌ బ్యాటరీలో డిస్టిల్డ్‌ వాటర్‌ కాకుండా తాగే నీరు పోస్తే ఏం జరుగుతుంది..!

Distilled Water vs Tap Water: ఇన్వర్టర్ బ్యాటరీలో తాగునీటిని పోయవచ్చని కొందరు అనుకుంటారు కానీ అలా చేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఈ నీటిలో బ్యాటరీ రసాయన ప్రతిచర్యలకు అంతరాయం కలిగించే మలినాలు, ఖనిజాలు ఉంటాయి. ఫలితంగా బ్యాటరీ సామర్థ్యం, బ్యాటరీ లైఫ్ తగ్గిపోతాయి. బ్యాటరీ లీక్ అవుతుంది. కొన్నిసార్లు పేలిపోయే సందర్భాలు ఏర్పడుతాయి. అందుకే ఇన్వర్టర్ బ్యాటరీలో డిస్టిల్డ్ లేదా డీమినరలైజ్డ్ వాటర్ మాత్రమే పోయాలి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

డీమినరలైజ్డ్ నీటిలో మలినాలు, ఖనిజాలు ఉండవు. కాబట్టి ఇవి బ్యాటరీకి సురక్షితం. నీరు పోయడానికి ముందు బ్యాటరీని స్విచ్ ఆఫ్ చేయాలి. నీరు పోసిన తర్వాత బ్యాటరీని ఆన్ చేయాలి. బ్యాటరీలో నీటిని పోస్తున్నప్పుడు ఏదైనా సమస్య ఎదురైతే సాంకేతిక నిపుణుడిని సంప్రదించాలి. ఇన్వర్టర్ బ్యాటరీని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం.

ఇన్వర్టర్ బ్యాటరీని జాగ్రత్తగా చూసుకోవడానికి బ్యాటరీని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. సూర్యకాంతి, వర్షం నుంచి బ్యాటరీని కాపాడుకోవాలి. బ్యాటరీని క్రమం తప్పకుండా ఛార్జ్ చేయాలి. బ్యాటరీని ఓవర్‌ఛార్జ్ చేయవద్దు అలాగే ఎక్కువ డిశ్చార్జ్ చేయవద్దు. దీనివల్ల ఇన్వర్టర్ బ్యాటరీని ఎక్కువ కాలం వస్తుంది. అలాగే బ్యాటరీలోకి నీటిని పోయడానికి ముందు దాని స్థాయిని చెక్‌ చేయాలి. బ్యాటరీలోకి నీటిని పోసేటప్పుడు నెమ్మదిగా పోయాలి. బ్యాటరీలోకి నీరు పోసిన తర్వాత బ్యాటరీ టెర్మినల్స్‌ను శుభ్రం చేయాలి.

Tags:    

Similar News