Split AC: మండే ఎండలో చల్ల చల్లని ఏసీ.. ఈ 5 స్టార్‌ రేటింగ్‌‌ 1.5 టన్‌ ఏసీపై కళ్లుచెదిరే భారీ డిస్కౌంట్‌..!

5 Star Rated Split AC: ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అందరూ కూలర్లు, ఫ్యాన్లు, ఏసీలు కొనుగోలు చేస్తారు. రానురాను ఏసీలకు భారీగా డిమాండ్‌ పెరిగిపోతుంది. 5 స్టార్‌ రేటెడ్‌ స్ల్పిట్‌ ఏసీలపై భారీ డిస్కౌంట్లు ప్రకటించారు.

Update: 2025-03-21 06:30 GMT

Split AC: మండే ఎండలో చల్ల చల్లని ఏసీ.. ఈ 5 స్టార్‌ రేటింగ్‌‌ 1.5 టన్‌ ఏసీపై కళ్లుచెదిరే భారీ డిస్కౌంట్‌..!

5 Star Rated Split AC: మండే ఎండాకాలం దిగ్గజ ఫ్లిప్‌కార్డ్‌ చల్లని కబురు అందించింది. పెద్ద కంపెనీలు అయిన బ్లూస్టార్, ఎల్‌జీ, వొల్టాస్‌, హయర్‌, రీయల్‌మీ, సామ్‌సంగ్ ఏసీలపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఫ్లిప్‌ కార్ట్‌ స్ప్లిట్‌ ఏసీలపై ఫ్లాట్‌ డిస్కౌంట్‌ ఆఫర్లలో సేల్‌ పెట్టింది. ఇది కాకుండా అదనంగా ఎక్స్చేంజ్‌ ఆఫర్లను కూడా ఇస్తోంది. భారీ డిస్కౌంట్‌ ధరలలో అందుబాటులో ఉన్న స్ల్పిట్‌ ఏసీ ధరలను తెలుసుకుందాం.

హయర్‌ 1.6 టన్‌, 5 స్టార్‌ రేటింగ్‌ ఏసీ..

హయర్‌ అందిస్తోన్న ఈ 5 స్టార్‌ రేటింగ్‌ స్ల్పిట్‌ ఏసీ ఇన్‌వర్టర్‌ మోడల్‌. దీని మోడల్‌ నంబర్‌ HS19E-TXG5BN. దీని ధర సాధారణంగా రూ. 76,500 కానీ, డిస్కౌంట్‌లో రూ.43,490 అంటే ఏకంగా 43 శాతం తక్కువకు లభిస్తుంది. ఎక్స్చేంజ్‌ ఆఫర్‌లో మీ పాత ఏసీని మారిస్తే ఏకంగా మరో రూ.5,600 తక్కువకు లభిస్తుంది.

బ్లూస్టార్‌ 1 టన్, 5 స్టార్‌ రేటింగ్‌..

బ్లూస్టార్‌ 1 టన్‌ ఏసీ 5 స్టార్ రేటింగ్‌ కలిగి ఉంది. సాధారణంగా ఈ ఏసీ ధర అయితే, రూ.63 వేలు ఉంటుంది. కానీ, 42 శాతం భారీ డిస్కౌంట్‌లో బ్లూస్టార్‌ ఏసీ విక్రయిస్తోంది. దీంతో మీరు కేవలం రూ.36,490 మాత్రమే పొందుతారు. ఇక మీరు ఫ్లిప్‌కార్టులో ఎక్స్చేంజ్‌ ఆఫర్ కూడా ఉపయోగిస్తే మరో రూ.5,600 ఆఫర్‌ పొందుతారు.

ఎల్‌జీ 5 స్టార్‌ రేటింగ్‌ ఏసీ..

ఎల్‌జీ వన్‌ టన్‌ 5 స్టార్‌ రేటింగ్‌ ఏసీ కూడా కట్టింగ్‌ ఎడ్జ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్ కలిగి ఉంది. దీని అసలు ధర రూ.75,990 ఉంది. 48 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.39,490 మాత్రమే. ఏసీ 4 వే ఏయిర్‌ స్వింగ్‌ ఫీచర్‌ రూమ్‌ మొత్తం ఎయిర్‌ ఫ్లో అవుతుంది.

ఓల్టాస్‌ 1.5 టన్‌ 5 స్టార్‌ రేటింగ్‌..

ఓల్టాస్‌ 1.5 టన్‌ స్ల్పిట్‌ ఏసీ మోడల్‌ 185V వెక్ట్రా ఎలిగెంట్‌ . ఇది ఇన్‌వర్టర్‌ మోడల్‌ రూ.75,990 అయితే, 46 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.40,900 మాత్రమే అందుబాటులో ఉంది.

Tags:    

Similar News