చెస్టర్ లీ స్ట్రీట్: ప్రపంచకప్‌లో భాగంగా రివర్సైడ్ వేదికగా శ్రీలంక X వెస్టిండీస్ జట్లు మరికొద్దిసేపట్లో తలపడనున్నాయి. టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా ఇరు జట్లూ ఇప్పటివరకు ఏడేసి లీగ్ మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాయి. లంక ఆరు పాయింట్లతో ఉండగా విండీస్ మూడు పాయింట్లతో సరిపెట్టుకుంది. సెమీస్ ఆశలను నిలుపుకునేందుకు తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో తలపడేందుకు శ్రీలంక సిద్ధమైంది.
శ్రీలంక జట్టు: కరుణరత్నే, కౌశల్ పెరెరా, అవిష్క ఫెర్నాండో, కుశల్ మెండీస్, ఏంజెలో మాథ్యూస్, లాహిరు తిరిమన్నె, ధనంజయ డి సిల్వా, ఇసురు ఉదానా, జెఫ్రీ వండెర్సే, కసున్ రజిత, లసిత్ మలింగా
విండీస్: క్రిస్ గేల్, సునీల్ అంబ్రిస్, షాయ్ హోప్, నికోలస్ పూరన్, షిమ్రోన్ హిట్మెయిర్, జాసన్ హోల్డర్, కార్లోస్ బ్రాత్‌వైట్, ఫాబియన్ ఆలెన్, షెల్డన్ కాట్రెల్, ఓషానే థామస్, షానూన్ గాబ్రియేల్