Umar Gul:అప్పుడైతే సచిన్‌.. ఇప్పుడైతే కోహ్లీ ... పాక్ మాజీ ఫేసర్ కీలక వాఖ్యలు

Umar Gul:పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ ఉమర్‌గుల్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు... ఒక్కప్పడు భారత్ నుంచి తన అభిమాన ఆటగాడు సచిన్ అని కానీ ఇప్పడు కోహ్లీ అంటూ చెప్పుకొచ్చాడు.

Update: 2020-06-27 17:41 GMT

పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ ఉమర్‌గుల్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు... ఒక్కప్పడు భారత్ నుంచి తన అభిమాన ఆటగాడు సచిన్ అని కానీ ఇప్పడు కోహ్లీ అంటూ చెప్పుకొచ్చాడు.. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉమర్ గుల్ ఈ వాఖ్యలు చేసాడు..అయితే తన అభిప్రాయం ఎందుకు మారిందో ఉమర్‌గుల్‌ ఈ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

కెరీర్ మొదటినుంచి తనకి సచిన్ అంటే చాలా ఇష్టమని, అతగాడి ఆటను తాను చాలా బాగా ఎంజాయ్ చేసేవాడినని ఉమర్ గుల్ చెప్పుకొచ్చాడు.. అయితే గత నాలుగేళ్ళ క్రితం నుంచి మాత్రం... భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆడుతున్న విధానం తనని అంతగానో ఆకట్టుకుందని అన్నాడు.. మైదానంలో తమతో అడుతున్నప్పుడు, ఇప్పుడు తన ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందని ఉమర్ గుల్ అభిప్రాయ పడ్డాడు.. ఇక కోహ్లీ ఆటను చూసి చాలా ఎంజాయ్ చేస్తానని చెప్పుకొచ్చాడు..

ఇది ఇలా ఉంటే ఇండియన్ క్రిక్రెట్ లో కోహ్లీ ని సచిన్ తో పోల్చడం సర్వసాధారణం అయిపోయింది.. ఇప్పటికే నిలకడగా రాణిస్తూ జట్టును ముందుకు నడుపుతున్నాడు.. ఇక సచిన్ సాధించిన రికార్డులును సైతం కోహ్లీ తిరగరాస్తున్నాడు.. కోహ్లీ ఇప్పటికే 70 సెంచరీలు చేశాడు.. ప్రస్తుతం కోహ్లీ వయసు దృష్ట్యా వంద సెంచరీల మార్కును అందుకోవడం పెద్ద విషయం ఏమీ కాదు.. ఇక సచిన్‌ వన్డేల్లో 18426, టెస్టుల్లో 15921 పరుగులు చేశాడు. కోహ్లీ వన్డేల్లో 11,867 చేయగా టెస్టుల్లో 7240తో కొనసాగుతున్నాడు..ఇక పరుగుల విషయంలో మాత్రం కోహ్లీ చాలానే వెనుకబడ్డాడనే చెప్పాలి..   

Tags:    

Similar News