ప్రపంచ కప్ : - ప్రపంచ కప్ తుది దశకు చేరుకుంది . ఇప్పటికే ఆస్ట్రేలియా, భారత్ మరియు ఇంగ్లాండ్ జట్లు సెమిస్ కి చేరుకున్నాయి. ఇప్పుడు నాలుగో స్థానం ఎవరిదీ అన్నది మాత్రం అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు . ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో న్యూజిలాండ్ జట్టు ఉంది . అ తర్వాత స్థానంలో పాకిస్తాన్ ఉంది . నెట్రన్రేట్లో పాకిస్థాన్(-792) కన్నా కవీస్(+0.175) ముందంజలో ఉంది. పాక్ కి బంగ్లాదేశ్ తో చివరి లీగ్ మ్యాచ్ ఉంది . ఇందులో పాక్ గెలిచి సెమిస్ కి రావాలంటే మూడు అవకశాలు ఉన్నాయి ..
1. పాక్ మొదటగా బ్యాటింగ్ చేసి 350 పరుగులు చేసి 311 పరుగులతో గెలవాలి .
2. 400 పరుగులు చేసి 316 పరుగులతో గెలవాలి
3. 450 పరుగులు చేసి 321 పరుగులతో అయిన గెలవాలి .
ఇలా గెలిస్తే పాక్ న్యూజిలాండ్ జట్టును కిందికి జరిపి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానం సంపాదిస్తుంది . మరి క్రికెట్ చరిత్రలోనే ఇంతటి విజయాన్ని సొంతం చేసుకున్న జట్టు లేదు . కాబట్టి ఇది అసాధ్యమే అనుకోవడమే మేలు ..