అంతర్జాతీయ టీ 20 క్రికెట్లో ధోని చెత్త రికార్డు

భారత క్రికెట్ తరఫున మహేంద్రసింగ్ ధోని ఎన్నో రికార్డులు సృష్టించాడు..

Update: 2020-04-21 09:17 GMT
MS Dhoni (File Photo)

భారత క్రికెట్ తరఫున మహేంద్రసింగ్ ధోని ఎన్నో రికార్డులు సృష్టించాడు.. క్రికెట్ ప్రపంచంలోనే మూడు ఐసీసీ టైటిల్స్ గెలిచిన ఏకైక కెప్టెన్ గా పేరు సంపాదించుకున్నాడు.. కానీ అదే ధోనీ పైన మరో చెత్త రికార్డు కూడా నెలకొంది. గత 14 ఏళ్లుగా అంతర్జాతీయ టీ 20 క్రికెట్ ఆడుతున్న ధోని ఒక్కమ్యాచ్‌లో కూడా ''మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌‌''గా నిలవలేకపోయాడు. 2006 లో తొలి టీ20 మ్యాచ్ ఆడిన ధోనీ ఇప్పటివరకు 98 టీ20 మ్యాచ్‌లాడాడు.

అందులో 37.6 సగటుతో 1,617 పరుగులు చేశాడు. ఇందులో 116 ఫోర్లు, 52 సిక్సర్లు ఉండగా.. కేవలం రెండు హాఫ్ సెంచరీలను మాత్రమే ధోనీ నమోదు చేశాడు. ఇక ధోని తరవాత స్థానంలో దినేశ్ రామ్‌దిన్ (71 మ్యాచ్‌లు), అస్గర్ అఫ్గాన్ (69), విలియమ్ పోర్టర్‌ఫీల్డ్ (61), దినేశ్ చండిమాల్ (54) టాప్-5లో ఒక్క మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకోకుండా కొనసాగుతున్నారు.. ఇక ఈ ఏడాది ఆసీస్ లో జరగబోయే టీ 20 వరల్డ్ కప్ తర్వాత ధోని రిటైర్మెంట్ ప్రకటించే అలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

Tags:    

Similar News