త్వరలో అజహరుద్దీన్ కోడలు కానున్న సానియా మిర్జా సోదరి

భారత మాజీ క్రికెటర్, కెప్టెన్ అజహరుద్దీన్ కుమారుడు, భారత టెన్నిస్ స్టార్ స్టార్ సానియా మిర్జా సోదరి త్వరలో ఒకటి కానున్నారు.

Update: 2019-12-09 11:25 GMT
anam mirzaaa

భారత మాజీ క్రికెటర్, కెప్టెన్ అజహరుద్దీన్ కుమారుడు, భారత టెన్నిస్ స్టార్ స్టార్ సానియా మిర్జా సోదరి త్వరలో ఒకటి కానున్నారు. గత కొద్ది రోజుల నుండి ప్రేమలో ఉన్న అసదుద్దీన్, ఆనమ్ మిర్జా ఇరువురి కుటుంబ సభ్యుల మధ్య ఒకటి కానున్నారు. వీరి వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చక చక జరుగుతున్నాయి.

ఇప్పటికే ఇరువురి కుటుంబ సభ్యుల మధ్య వీరిద్దరికి నిశ్ఛితార్థ వేడుకను ఘనంగా నిర్వహించారు. డిసెంబర్ మూడో వారంలో వీరిద్దరి వివాహం జరగనుంది. ఈ క్రమంలో వివాహానికి ముందు ఆనమ్ మిర్జా తన స్నేహితులకు ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసింది. దీనికి సంబంధిచిన ఫోటోలను ఆనమ్ మిర్జా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇక ఆనమ్ మిర్జాకు ఇది రెండో వివాహం.. గతంలో తన మాజీ భర్త అక్బర్ రషీద్‌ నుంచి ఆమె విడాకులు తీసుకున్నారు. ఇక అజహరుద్దీన్ కి ఇద్దరు కుమారులు ఉన్నారు. అందులో ఒకరు ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు.  



Tags:    

Similar News