క్రికెట్ దేవుడికి ముప్పై ఏళ్ళు .. !

Update: 2019-11-15 10:25 GMT
sachin tendulkar

క్రికెట్ దేవుడు అంటే అందరికి గుర్తొచ్చే పేరు సచిన్ టెండుల్కర్ పేరు మాత్రమే .. క్రికెట్ అంటే సచిన్, సచిన్ అంటే క్రికెట్ అనే స్థాయికి తన ఆటను తీసుకువెళ్ళాడు సచిన్.. నేటితో సచిన్ క్రికెట్ లోకి అడుగుపెట్టి ముప్పై ఏళ్ళు పూర్తి అయింది. మొదటగా సచిన్ తన 16 ఏళ్ల వయసులో 1989 నవంబర్ 15 న పాకిస్తాన్ తో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు.. ఆ మ్యాచ్ లో కేవలం 15 పరుగులు మాత్రమే చేసి వకార్ యూనిస్ బౌలింగ్ లో అవుటయ్యాడు. వకార్ కు కూడా ఇదే తొలి టెస్ట్ మ్యాచ్ కావడం గమనార్హం. ఆ తర్వాత అంచలంచలుగా ఎదిగిన సచిన్ చాలా రికార్డులను నెలకొల్పాడు.. ప్రపంచ క్రికెట్ లో సచిన్ ఓ చరిత్ర సృష్టించాడు.

సచిన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

1) అతిపిన్న వయస్సులో (16) వన్డే క్రికెట్ ఆడిన భారతీయుడుగా సచిన్ చరిత్రకెక్కాడు.

2) వన్డే,టెస్ట్ మ్యాచ్ లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్ రికార్డు సృష్టించాడు.

3) అన్ని టెస్టు ఆడే దేశాలపై సెంచరీలు సాధించిన తొలి భారతీయుడుగా సచిన్ రికార్డులోకి ఎక్కాడు.

4) వన్డేలలో డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా సచిన్ రికార్డు నెలకొల్పాడు.

5) అత్యధిక సార్లు మ్యాన్ అఫ్ ది మ్యాచ్, మ్యాన్ అఫ్ ది సిరీస్ లను అందుకున్న బ్యాట్స్ మెన్ గా సచిన్ రికార్డు సృష్టించాడు.

6) మొత్తం 200 టెస్ట్ మ్యాచ్ లు , 463 వన్డే మ్యాచ్ లు ఆడాడు సచిన్

ఇవే కాకుండా సచిన్ చాలా రికార్డులును నెలకొల్పి క్రికెట్ పుస్తకంలో తనకంటూ ఓ పేజీని క్రియేట్ చేసి భావితరాలకు ఓ మార్గదర్శి అయ్యాడు.  

Tags:    

Similar News