యువీ రికార్డుపై కన్నేసిన రోహిత్ ...

ఇండియన్ టీమ్ మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్‌ సింగ్‌ వన్డేలో చేసిన పరుగులను చేధించడానికి రోహిత్ కేవలం 26 పరుగుల వెనుకంజలో ఉన్నాడు .

Update: 2019-08-14 05:02 GMT

భారత ఓపెనర్ బాట్స్ మెన్ రోహిత్ శర్మ మరో రికార్డుపైన కన్నేసాడు .. ఇండియన్ టీమ్ మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్‌ సింగ్‌ వన్డేలో చేసిన పరుగులను చేధించడానికి రోహిత్ కేవలం 26 పరుగుల వెనుకంజలో ఉన్నాడు . భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా యువరాజ్‌ ఏడో స్థానంలో ఉన్నాడు. యువరాజ్ మొత్తం 304 వన్డేల్లో 8701 పరుగులు చేసాడు . ఇక రోహిత్ శర్మ 217 మ్యాచుల్లో 8676 పరుగులు చేశాడు. దీనితో యువరాజ్ పరుగులను బ్రేక్ చేయాలంటే రోహిత్ కి 26 పరుగులు అవసరం ఉన్నాయి ..ఇక ఈరోజు ఇండియా మరియు విండీస్ మధ్య జరగనున్న మ్యాచ్ లో రోహిత్ ఈ ఘనతను సాధించాలని ఫాన్స్ ఆశిస్తున్నారు .

భారత్‌ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు: సచిన్‌ తెందుల్కర్‌ (18426), విరాట్ కోహ్లీ (11406), సౌరభ్‌ గంగూలీ (11363), రాహుల్‌ ద్రవిడ్‌ (10889), ఎంఎస్ ధోనీ (10773), మహ్మద్‌ అజారుద్దీన్‌ (9378), యువరాజ్‌ సింగ్ (8701), రోహిత్‌ శర్మ (8676).

Tags:    

Similar News