ఆర్సీబీ టార్గెట్ 188 పరుగులు..

Update: 2019-03-28 16:23 GMT

ఐపీఎల్‌-12వ సీజన్‌లో భాగంగా గురువారం ఇక్కడ చిన్నస్వామి స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ముందుగా ముంబైను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి ముంబై జట్టు 187 పరుగులు చేసింది. ఓపెనర్లు డి కాక్ (23), రోహిత్ శర్మ(48) శుభారంభాన్నిచ్చారు. వీరిద్దరూ చక్కగా క్రీజులో కుదురుకున్న తరుణంలో యజువేంద్ర చాహల్ డి కాక్ ను బౌల్డ్ చేశాడు.

ఆ తరువాత రోహిత్ శర్మ కూడా ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో మహమ్మద్ సిరాజ్ కు క్యాచ్ ఇచ్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్(38), యువరాజ్ సింగ్(23) జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ కూడా చాహల్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అయ్యారు. ఆ తరువాత హార్దిక్ పాండ్య(32) మినహా ఎవరూ కూడా రెండంకెల స్కోర్ చెయ్యలేదు. దీంతో ముంబై 187 పరుగులు చేయగలిగింది. రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు బౌలర్లలో యజువేంద్ర చాహల్ 4 వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు. ఆర్సీబీ టార్గెట్ 188 పరుగులు.

Similar News