ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. పాక్ బౌలర్లు కట్టడి చేసినా బ్యాట్స్‌మెన్ మాత్రం బాధ్యతాయుతంగా ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు. అస్ఘర్(42; 35బంతుల్లో 3×4, 2×6), నజీబుల్లా(42; 54బంతుల్లో 6×4) ఆకట్టుకున్నారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిదీ(4/47), వాహబ్ రియాజ్(2/29), ఇమాద్ వసీం(2/48) గొప్పగా బౌలింగ్ చేశారు. వరల్డ్‌కప్ టోర్నీలో ఒక మ్యాచ్‌లో నాలుగు వికెట్ల ప్రదర్శన చేసిన తొలి యువ క్రికెటర్‌గా షాహీన్ నిలిచాడు.