INDvsNZ 1st Test: మొదటి టెస్ట్ లో భారత్ పై న్యూజిలాండ్‌ గెలుపు

Update: 2020-02-24 01:44 GMT
india vs new zealand 1st test (File Photo)

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలిటెస్టులో న్యూజిలాండ్‌ విజయం సాధించింది... ఓవర్‌నైట్‌ స్కోరు 144/4 తో నాలుగోరోజు బ్యాటింగ్ ని ప్రారంభిచిన భారత్ కేవలం 191 పరుగులకే ఆలౌటైంది. దీనితో కివీస్ జట్టుకు 9 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగింది. ఇక రెండో ఇన్నింగ్స్ ని ప్రారంభించిన కివీస్ జట్టు వికెట్‌ నష్టపోకుండా 1.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించి ఇంకా ఒక్కరోజు అట ఉండగానే మ్యాచ్ ని ఫినిష్ చేసింది.

నాలుగోరోజు తిరిగి ఆటను ప్రారంభిచిన భారత్ నాలుగు పరుగులు చేశాక అంటే 148 పరుగుల వద్ద అజింక్యా రహానె(29) వికెట్ కోల్పోయింది. అనంతరం విహారి (15) కూడా వెనుదిరిగాడు. ఇక ఆ తర్వాత వచ్చిన రిషభ్‌ పంత్‌(25), రవిచంద్రన్‌ అశ్విన్‌(4), ఇషాంత్‌ శర్మ(12), మహ్మద్‌ షమి(2), జస్ప్రీత్‌ బుమ్రా (0) వెంటవెంటనే అవుట్ అయ్యారు. దీనితో న్యూజిలాండ్‌ తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని మాత్రమే భారత్ ఉంచగలిగింది. అంతకుముందు పృథ్వీషా(14), ఛెతేశ్వర్‌ పుజారా(11), కోహ్లీ(19) కూడా ఫెయిల్ అయ్యారు. జట్టులో మయాంక్‌ అగర్వాల్‌(58) ఒక్కడే ఆకట్టుకున్నాడు.

మొత్తం ఈ మ్యాచ్ లో 9 వికెట్లు తీసిన సౌథీ మ్యాన్ అఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఇక ఈ టెస్ట్ మ్యాచ్ లో భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 165 పరుగులకి ఆలౌట్‌ కాగా, కివీస్ జట్టు 348 పరుగులకి ఆలౌట్‌ అయి 183 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో 191 ఆలౌట్‌ కాగా, కివీస్ వికెట్ నష్టపోకుండా 9 పరుగులను చేధించింది. దీనితో రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో ఆ జట్టు ముందుంది. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ ఫిబ్రవరి 29 నుంచి మొదలవుతుంది. ఇక ఇప్పటికే జరిగిన టీ20 సిరీస్ లో భారత్ క్లీన్ స్వీప్ చేస్తే, వన్డే సిరీస్ లో క్లీన్ స్వీప్ చేసింది. 

Tags:    

Similar News