New Zealand vs India, 2nd T20I : భారత జట్టులో ఒక మార్పు

Update: 2020-01-26 05:34 GMT

టీమిండియా న్యూజిలాండ్ మధ్య ఐదు టీ20ల సిరీస్ జరుగుతుంది. అందులో భాగంగా ఆక్లాండ్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీనితో భారత్ 1-0తో ముందంజలో ఉంది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ ఈ రోజు జరగనుంది. దీనికి కూడా ఆక్లాండ్ మరో సారి వేదికకానుంది.

ఇప్పటికే ఒక మ్యాచ్ గెలిచి టీమిండియా ఆత్మవిశాస్వంతో ఉంది. సొంత గడ్డ భారత్ జట్టుతో జరిగిన తొలి టీ20 భారీ స్కోరు చేసి కూడా ఓడిపోడంతో నిరుత్సాహంతో ఉంది. రెండో టీ20లో భారత్ పై గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంది. దీంతో ఈ మ్యాచ్ ను ఇరు జట్లు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మొత్తానికి ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది.

మొదటి మ్యాచ్ ఇదే స్టేడియంలో జరగడంతో పిచ్ పై పూర్తి అవగాహన వచ్చేసింది. పూర్తిగా బ్యాట్స్ మెన్స్ కి అనుకూలించడంతో కివీస్ 20 ఓవర్లలో 203 పరుగులు చేస్తే, ఇంకో ఓవర్ మిగిలి ఉండగానే భారత ఆ లక్ష్యాన్ని చేధించింది. దీనితో బౌలర్లకి ఈ మ్యాచ్ అగ్ని పరీక్ష లాగా మారింది. ఈ మ్యాచ్ లో మొదటగా టాస్ గెలిచినా జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశాలే ఎక్కువ..

ఇక ఈ మ్యాచ్ లో భారత జట్టులో ఓ మార్పు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తుంది. ​శార్దూల్ ఠాకూర్ స్థానంలో నవదీప్ సైనీని ఆడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి టీ20లో శార్దూల్ ఠాకూర్ దారుణంగా విఫలమయ్యాడు. కేవలం మూడు ఓవర్లలలో 44 పరుగులు సమర్పించుకున్నాడు. దీనితో అతని స్థానంలో నవదీప్ సైనీని జట్టులోకి తీసుకోవడం ఖాయమని తెలుస్తోంది.

జట్ల వివరాలు ఇలా ఉన్నాయి ..

భారత్ :

విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, లోకేశ్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్/నవదీప్ సైనీ, యజ్వేంద్ర చాహల్.

న్యూజిలాండ్ :

కేన్ విలియమ్సన్ (కెప్టెన్), కొలిన్ మున్రో, మార్టిన్ గప్టిల్, టిమ్ సీఫెర్ట్, రాస్ టేలర్, కొలిన్ డి గ్రాండ్‌హోమ్, మిషెల్ సాంట్నర్, ఇష్ సోధీ, టిమ్ సౌతీ, టిక్నర్, బెన్నెట్. 

Tags:    

Similar News