New Zealand vs India, 2nd Test : కుప్పకూలిన కివీస్

Update: 2020-03-01 02:24 GMT
New Zealand vs India, 2nd Test (File Photo)

క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా న్యూజిలాండ్, భారత జట్ల మద్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో రెండో రోజు లంచ్ సమయానికి కివీస్‌ జట్టు 53 ఓవర్లకు గాను 7 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. 63/0తో రెండో రోజు ఆటను తిరిగి ప్రారంభించిన కివీస్ జట్టును భారత బౌలర్లు బాగానే కట్టడి చేశారు.. రెండో రోజు కివీస్‌కు ఆదిలోనే ఉమేశ్‌యాదవ్‌ పెద్ద షాకిచ్చాడు. 25.3 ఓవర్‌లో టామ్‌ బ్లండెల్‌(30)ను ఎల్బీగా పెవిలియన్‌ పంపాడు. మరో మూడు పరుగుల వ్యవధిలో కెప్టెన్‌ విలియమ్సన్‌(3)ను బుమ్రా బోల్తా కొట్టించాడు.

ఇక ఆ తర్వాత వచ్చిన రాస్‌టేలర్‌(15)తో కలిసి టామ్‌ లాథమ్‌(52) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఇద్దరు కలిసి 40 పరుగుల జోడించాక జడేజా టేలర్‌ ని అవుట్ చేసి వీరిని విడదీశాడు. ఇక కాసేపటికే లాథమ్‌(52) షమి బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. అనంతరం హెన్రీ నికోల్స్‌(14)కూడా వెంటనే వెనుదిరిగాడు. దీనితో కివీస్ జట్టు 142 పరుగులకే అయిదు వికెట్లను కోల్పోయింది.

ఇక ఆ తర్వాత బుమ్రా బౌలింగ్ లో వాట్లింగ్‌ (0), టిమ్‌సౌథీ(0) వెంటవెంటనే అవుట్ చేశాడు. దీంతో కివీస్‌ 53 ఓవర్లకు 153/7తో నిలిచింది. ప్రస్తుతం కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌(19), కైల్‌ జేమీసన్‌(0) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో మహ్మద్‌ షమి(2), జస్ప్రీత్‌ బుమ్రా(3) వికెట్లు తీయగా.. ఉమేశ్‌, జడేజా చెరో వికెట్‌ పడగొట్టారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్ లో 242 పరుగులకి ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.. 

Tags:    

Similar News