పుచ్చకాయలు పండిస్తున్న ఎంఎస్‌ ధోనీ

Update: 2020-02-28 17:07 GMT
MS Dhoni(File Photo)

గతేడాది ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ చేతిలో సెమీస్‌ ఓటమి తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న భారత మాజీ కెప్టెన్, ఇండియన్ సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోని తనకు దొరికిన సమయాన్ని తన అభిరుచులతో నింపేస్తున్నాడు. ముందుగా ఆర్మీ ఆఫీసర్ గా రెండు నెలల పాటు ఇండియన్ ఆర్మీలో పనిచేసి జవాన్‌గా దేశానికి సేవలను అందించాడు. ఆ తర్వాత వైల్డ్‌గ్రాఫ్ ఫొటో గ్రాఫర్.. నిన్న పిచ్ క్యూరెటర్.. కనిపిస్తూ ఆటకు దూరంగా ఉన్నప్పటికీ ఇలా అభిమానులకి దగ్గరగా ఉంటూనే వస్తున్నాడు. తాజాగా పొలాల్లో రైతుగా కనిపించాడు ధోని..

ధోనీకి వేర్వేరు వ్యాపారాలు ఉన్నాయి. ఈ మధ్యే అతడు సేంద్రియ వ్యవసాయం మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. రాంచీకి సమీపంలోని సొంత భూమిలో పుచ్చకాయలు సాగుచేస్తున్నట్టు ఓ వీడియో వైరల్‌ అయింది. రాంచీలో సేంద్రియ పుచ్చకాయల సాగును మొదలుపెడుతున్నానంటూ ధోనీ తన ఫేస్‌ బుక్‌లో పోస్టు చేశారు. మరో 20 రోజుల్లో బొప్పాయి సాగు చేస్తానన్న ఆయన తొలిసారి కావడంతో ఉత్సాహంగా అనిపిస్తోందని తెలిపాడు.

ఇన్ని రోజులు ఆటకి దూరంగా ఉంటూ వస్తున్న ధోని త్వరలోనే మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ఐపీఎల్‌ 2020లో చెన్నై సూపర్‌కింగ్స్‌ను మందుకు నడిపించేందుకు ధోని సిద్దం అవుతున్నాడు. సీనియర్లు సురేశ్‌ రైనా, అంబటి రాయుడు సహా అందుబాటులో ఉన్న క్రికెటర్లతో కలిసి ప్రాక్టిస్ చేస్తాడని చెన్నై జట్టు యాజమాన్యం చెప్పుకొచ్చింది.


Tags:    

Similar News