శ్రీలంక 200 దాటుతుందా?

Update: 2019-06-04 11:54 GMT

వరల్డ్ కప్ క్రికెట్ లో ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ తో తలపడుతున్న శ్రీలంక జట్టు బ్యాటింగ్ గతి తప్పింది. మొదట్లో దూకుడుగా ఆడిన శ్రీలంక బ్యాట్స్ మెన్ 22 వ ఓవర్ నుంచి క్యూ కట్టడం మొదలు పెట్టారు. ఆ ఓవర్లో నాలుగు వికెట్లు కోల్పోయిన శ్రీలంక జట్టు 31 వ ఓవర్ వచ్చే సరికి 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ నబి వరుసగా వికెట్లు తీసి శ్రీలంకను ఇబ్బందుల్లోకి నెట్టాడు.. అటు తరువాత ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఫీల్డింగ్, బౌలింగ్ ల్లో పట్టు బిగించింది. దీంతో ఒకవైపు పరుగులూ రాక.. మరోవైపు వికెట్లూ చేజార్చుకుంది శ్రీలంక. 32 వ ఓవర్ ముగిసేసరికి శ్రీలంక జట్టు 179  పరుగులు మాత్రమే చేసింది. 33 వ ఓవర్ మొదటి బంతికి ఒంటరి పోరాటం చేస్తున్న కుషాల్ పెరీరా ( 78 )  రషీద్ బౌలింగ్ లో కీపర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో శ్రీలంక 200 పరుగులు చేయడం కష్టంగానే కనిపిస్తోంది.

Tags:    

Similar News