India vs Australia, 2nd ODI :విజయకేతనం ఎగరవేసిన భారత్

Update: 2020-01-17 15:57 GMT

రాజ్ కోట్ వన్డేలో భారత జట్టు 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. 341 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఆసీస్ బాట్స్ మెన్స్ ని భారత్ బౌలర్లు కట్టుదిట్టం చేశారు . దీనితో ఆ జట్టు నిర్ణిత 50 ఓవర్లలో 304 పరుగులు చేసి అల్ అవుట్ అయింది. లక్ష్య చేధనకి బరిలో దిగిన ఆ జట్టుకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ 15 (12) మహ్మద్ షమీ వేసిన మూడో ఓవర్లో రెండో బంతికి భారీ షాట్ ఆడబోయి మనిష్ పాండేకి చిక్కాడు. ఆ తర్వాత వచ్చిన స్మిత్, పించ్ కలిసి ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఆ తర్వాత పించ్ అవుట్ అయినప్పటికీ స్మిత్ దూకుడు పెంచాడు. ఈ క్రమంలోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.

ఆ తర్వాత మరింత దూకుడు పెంచిన స్మిత్ జట్టు స్కోర్ 200 దాటించాడు. ఈ క్రమంలో కులదీప్ యాదవ్ వేసిన 38 ఓవర్ లో 98 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్మిత్ క్లీన్ బోల్డ్ అయ్యాడు. ఆ తర్వాత ఆసీస్ పతనం మొదలైంది. ఒక్కొక్కరిగా అవుట్ అవుతూ వెళ్లారు. ఈ నేపధ్యంలో భారత జట్టు విజయం ఖరారు అయిపొయింది. అంతకుముందు టాస్ ఒడి బ్యాటింగ్ కి దిగిన భారత జట్టుకి ఓపెనర్స్ రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ మంచి శుభారంభాన్ని ఇచ్చారు. ఇద్దరు కలిసి 81 పరుగులు జోడించారు. ఆ తర్వాత రోహిత్ వెనుదిరిగినప్పటికీ ధావన్ మాత్రం కోహ్లితో కలిసి స్పీడ్ గానే ఆడాడు .. హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అనంతరం మరింత దూకుడు పెంచాడు ధావన్ .. ఈ క్రమంలో 96(90) వ్యక్తిగత పరుగులు వద్ద ధావన్ అవుట్ అయ్యాడు.. ధావన్, కోహ్లి కలిసి 103 పరుగుల జోడించారు.

ఇక ఆ తరవాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్ 7 (17) నిరాశపరిచాడు. ఇక కేయల్ రాహుల్ తో కలిసి జత కట్టిన కోహ్లి మరింత దూకుడు పెంచాడు . ఈ క్రమంలో జంపా వేసిన 43 ఓవర్ లోని మొదటి బంతికి భారీ షాట్ ఆడబోయిన కోహ్లి 78 (76) బౌండరీ వద్ద స్టార్క్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వీరిద్దరూ నాలుగో వికెట్ కి 78 పరుగులు జోడించారు. ఇక చివరిలో కేయల్ రాహుల్ 80 (58), రవీంద్ర జేడేజా దూకుడు పెంచడంతో భారత్ 340 పరగులు చేయగలిగింది. ఇక ఆసీస్‌ బౌలర్లలో ఆడమ్‌ జంపా మూడు వికెట్లు సాధించగా, కేన్‌ రిచర్డ్‌సన్‌ రెండు వికెట్లు తీశాడు.

దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-1‌తో ఇరుజట్లు సమానంగా ఉన్నాయి.ఆదివారం బెంగళూరులో భారత్, ఆసీస్ జట్ల మధ్య మూడో వన్డే జరగనుంది.  

Tags:    

Similar News