India vs south africa : దక్షిణాఫ్రికాతో భారత్‌ తొలి వన్డే నేడే

కోహ్లి సేన మరో సమరానికి సిద్దం అయింది. నేటినుంచి దక్షిణాఫ్రికా జట్టుతో జరగబోయే మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ధర్మశాల వేదికగా ఇరు జట్ల

Update: 2020-03-12 01:35 GMT
India vs south africa first ODI

కోహ్లి సేన మరో సమరానికి సిద్దం అయింది. నేటినుంచి దక్షిణాఫ్రికా జట్టుతో జరగబోయే మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ధర్మశాల వేదికగా ఇరు జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. న్యూజిలాండ్‌ పర్యటనలో టెస్ట్, వన్డేలో ఘోర ఓటములు చవి చూసిన భారత్ జట్టు అదో పిడకల లాగా మర్చిపోయి మళ్ళీ ఆటను కొత్తగా ప్రారంభించాలని అనుకుంటుంది. కానీ మ్యాచ్ కి వరుణుడు అడ్డు పడే అవకాశం ఉంది. ఇక ఒక్కసారి జట్టు బలాబలాలు పరిశీలిస్తే..

ధావన్, పాండ్య తిరిగి జట్టులోకి :

శిఖర్ ధావన్, రోహిత్ శర్మ లాంటి అనుభవజ్ఞులు లేని లోటు న్యూజిలాండ్‌ పర్యటనలో స్పష్టంగా కనిపించింది. ఓపెనర్స్ గా భారత్ కి మంచి శుభారంభాన్ని ఇచ్చింది ఈ జోడి.. ప్రస్తుతం జట్టులో రోహిత్ లేనప్పటికీ శిఖర్ ధావన్ రాక కొత్త జోష్ ని నింపింది. ఇక తన స్థాయికి తగ్గ ప్రదర్శనను కనబర్చలేకపోతున్న కెప్టెన్ కోహ్లి మళ్ళీ బ్యాట్ కి పని చెప్పాల్సి ఉంది. ఇక శ్రేయాస్ అయ్యర్, కేఎల్‌ రాహుల్‌, పృథ్వీ షా రెచ్చిపోతే భారత్ భారీ స్కోర్ చేసే ఛాన్స్ ఉంది. ఇక అల్ రౌండర్ పాండ్య తిరిగి జట్టులోకి భారత్ కి మెయిన్ ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు..

తక్కువ అంచనా వేయొద్దు :

ఇటీవల సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్టును 3-0తో ఓడించి ఇండియా టూర్ కి ఎంత సిద్దంగా ఉన్నామో చెప్పకనే చెప్పింది. పెద్ద అనుభవజ్ఞులు లేనప్పటికీ ఆ జట్టును అంచనా వేయలేము. డుప్లెసిస్‌, డసెన్‌ తిరిగి జట్టులోకి రావడం ఆ జట్టుకు మరింత బలాన్ని చేకూర్చింది. క్లాసెన్‌, కైల్‌ వెరిన్‌ లాంటి వాళ్ళు ఆసీస్‌పై చూపించిన జోరును మరోసారి ప్రదర్శిస్తే దక్షిణాఫ్రికాకి విజయం నల్లేరుపై నడుకలాగే సాగుతుంది అని చెప్పడంలో సందేహం అక్కరలేదు.

పిచ్ ;

ధర్మశాలలో పలుమార్లు వర్షం పడే అవకాశం ఉంది. మొదటగా టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ కి ఎక్కువగా మొగ్గు చూపుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ చేజింగ్ చేసిన జట్టునే గెలవడం విశేషం.. ఇక పిచ్‌ పేస్‌ బౌలర్లకు సహకరించే అవకాశం ఉంది. ఇక్కడ భారత్ ఇప్పటివరకు నాలుగు వన్డేలు ఆడితే రెండు నెగ్గి, రెండిటిలో ఓడింది.

తుది జట్లు (అంచనా)

భారత్‌:

ధావన్‌, పృథ్వీ షా, కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్య, జడేజా, భువనేశ్వర్‌, నవ్‌దీప్‌ సైని, చాహల్‌, బుమ్రా

దక్షిణాఫ్రికా:

డికాక్‌, స్ముట్స్‌, డసెస్‌, డుప్లెసిస్‌, క్లాసెన్‌, మిల్లర్‌, ఫెలుక్వాయో, కేశవ్‌ మహారాజ్‌, హెండ్రిక్స్‌, నోర్జె, ఎంగిడి 

Tags:    

Similar News