ఫలితం తేలేది ఆఖరి రోజేనా..?

Update: 2019-01-05 01:55 GMT

సిడ్నీలో జరుగుతున్న నాల్గవ టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగిస్తోంది. లంచ్ విరామానికి ఒక వికెట్ నష్టానికి 122 పరుగులు చేసింది. బ్యాటింగుకు అనుకూలమైన ఈ పిచ్ లో ఆసీస్ కూడా పరుగుల వరద పారించేలా పరిస్థితి కనిపిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌ను టీమిండియా 622/7 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. కొండంత లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు నిలకడగా ఆడుతోంది. ప్రస్తుతం హర్రీస్, లాబ్స్ఛగన్ క్రీజులో ఉన్నారు.

తొలి వికెట్ గా ఉస్మాన్ కౌజ అవుట్ అయ్యాడు. టీమిండియా స్కోర్ ను ఆసీస్ బీట్ చెయ్యాలంటే కనీసం రెండు రోజులైనా పడుతుంది. ఈ క్రమంలో రెండు జట్లు ఫలితం కోసం పోరాడితే మాత్రం ఇదో రోజే తేల్చుకోవాల్సి ఉంటుంది. లేదా ఆస్ట్రేలియా 300 లోపు అల్ అవుట్ అయితే మాత్రం ఫాలో ఆన్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. అప్పుడు భారత్ ఆధిపత్యాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది. 

Similar News