ఐదోసారి తండ్రి అయిన షాహిద్ అఫ్రిది

పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది అయిదోసారి తండ్రి అయ్యారు. తన భార్య నదియా శుక్రవారం ఓ పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చింది.

Update: 2020-02-15 12:26 GMT

పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది అయిదోసారి తండ్రి అయ్యారు. తన భార్య నదియా శుక్రవారం ఓ పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చింది. 45 ఏళ్ల వయసున్న అఫ్రిది అయిదోసారి తండ్రి అవ్వడం విశేషం.. ఈ విషయాన్ని అఫ్రిది ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇప్పటికే నదియా,అఫ్రిది దంపతులకి నలుగురు అడ సంతానం కాగా ఇప్పుడు ఐదో పాప తమ ఫ్యామిలీలోకి ఎంట్రీ ఇచ్చింది. దీనితో అఫ్రిది కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. అఫ్రిది తండ్రి కావడంతో పలువురు ఫ్యాన్స్ అతనికి విషెస్ చెబుతున్నారు. ఇప్పటివరకు అఫ్రిది పాకిస్తాన్ 27 టెస్ట్ మ్యాచ్లు , 398 వన్డేలు, 99 టీ 20 మ్యాచ్లు ఆడాడు. ఇక 2009 నుంచి 2011వరకు ఆ జట్టుకు కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. 


Tags:    

Similar News