గంభీర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన దిలీప్‌ వెంగ్‌సర్కార్‌!

ఇండియన్ మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు మాజీ చీఫ్‌ సెలక్టర్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌..

Update: 2020-05-25 05:56 GMT
Gautam Gambhir (File Photo)

ఇండియన్ మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు మాజీ చీఫ్‌ సెలక్టర్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌.. గంభీర్ గొప్ప ఆటగాడు అని కానీ అతను గ్రౌండ్ లో ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేడని, అదే అతనికి పెద్ద మైనస్ అని, ఒక వేళ తన పద్దతి మార్చుకొని ఉంటే టీమిండియా తరుపున మరిన్ని మ్యాచ్‌లు ఆడేవాడని వెంగ్‌సర్కార్‌ అభిప్రాయపడ్డాడు.

తాజాగా ఓ డిబేట్‌లో మాజీ చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌పై గంభీర్‌ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. జట్టులో నుంచి తొలగించేముందు ఆటగాళ్లకు కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదని మండిపడ్డాడు. గంభీర్ తో పాటు యువీ, రైనా విషయంలో కూడా ఇలాగే జరిగిందని గంభీర్ చెప్పుకొచ్చాడు. దీనితో గంభీర్ వ్యాఖ్యల పై దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ ఇలా స్పందించాడు.

ఇక 2003లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన గంభీర్ 15 ఏళ్ల పాటు సుదీర్ఘ క్రికెట్‌ ఆడి 2018లో ఆటకు గుడ్‌బై చెప్పాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ గా ఇండియన్ టీంకి ఎన్నో విజయాలను అందించాడు గంభీర్.. ఇక 2007 లో భారత జట్టు గెలిచిన టీ 20 వరల్డ్ కప్, 2011 లో గెలిచిన వరల్డ్ కప్ లో గంభీర్ అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచాడు.


Tags:    

Similar News