అదే దూకుడు.. భారీ స్కోరు దిశగా ఇంగ్లాండ్

Update: 2019-06-08 12:26 GMT

ఎక్కడా తగ్గకుండా స్కోరు బోర్డును ముందుకు ఉరికిస్తున్నారు ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్. ప్రపంచకప్ లో భాగంగా బంగ్లాదేశ్తో జరుగుతున్నా మ్యాచ్ లో ఇంగ్లాండ్ పటిష్ట స్థితిలో ఉంది. జోరుగా బ్యాటింగ్ చేసిన ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ (153; 121 బంతుల్లో ) ఔటయ్యాడు. మెహదీ హసన్‌ వేసిన 35వ ఓవర్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాది హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. నాలుగో బంతినీ స్టాండ్స్‌లోకి తరలించే క్రమంలో మొర్తజాకు క్యాచ్‌ ఇచ్చాడు. అతడి ఊపు చూస్తే 200 చేసేలా కనిపించాడు. కానీ వేగంగా అదే క్రమం లో ఔటయ్యాడు. రాయ్ అవుటైన తర్వాత మోర్గాన్ క్రీజులోకి వచ్చాడు. మోర్గాన్, జోస్‌ బట్లర్‌ ఇన్నింగ్స్ లో వేగం తగ్గకుండా స్థిరంగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ 40 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. బట్లర్‌ (30), మోర్గాన్‌ (14) చివరి 10 ఓవర్లు నిలిచి దూకుడుగా ఆడితే 400 సాధ్యమే అనిపిస్తోంది. 2015 ఏప్రిల్‌ నుంచి గణాంకాలు పరిశీలిస్తే..చివరి 10 ఓవర్లలో జోస్‌ బట్లర్‌- 180.85, ఇయాన్‌ మోర్గాన్‌ - 153.38 స్ట్రైక్‌ రేట్‌ సాధించారు. ఇపుడు కూడా ఆ స్ట్రైక్ రేట్ కొనసాగితే ఇంగ్లాన్డ్ 400 వరకూ చేరడం దాదాపు ఖాయం.

Tags:    

Similar News