ఇక్కట్లలో ఇంగ్లాండ్

Update: 2019-06-03 15:32 GMT

349 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు నిలకడగా ఆడుతోంది. ఓపెనర్ల వికెట్లను పది ఓవర్లలోనే కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టును.. రూట్‌, మోర్గాన్‌ నిదానంగా నిలబెడుతూ వచ్చారు. అయితే, క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్న కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌(9; 17బంతుల్లో) హఫీజ్‌ వేసిన 15ఓవర్‌ ఐదో బంతికి క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. త్తరువాత వచ్చిన స్టోక్స్ సహాయంతో జట్టును నడిపించిన రూట్ ఈ క్రమం లో తన అర్థ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. రూట్, స్టోక్స్ ఇద్దరూ ఆచి, తూచి ఆడుతుండడంతో ఇంగ్లాండ్ జట్టు స్కోరు నిదానంగా కదిలింది. ఈ దశలో ఇంగ్లాండ్ కు మరో షాక్ తగిలింది. ఇన్నింగ్స్ 21 వ ఓవర్లో మాలిక్  బౌలింగ్ లో స్టోక్స్అవుటయ్యాడు. దీంతో 22 ఓవర్లకు 123 పరుగులు చేసిన ఇంగ్లాండ్ 4 వికెట్లు కోల్పోయి ఇక్కట్లలో పడింది. ఇంకా ఇంగ్లాండ్ విజయానికి 226 పరుగులు కావాలి. 

Tags:    

Similar News