ధావన్ మెరుపులు

Update: 2019-06-09 11:31 GMT

రోహిత్ అవుటవడంతో.. విరాట్ కోహ్లీయే క్రీజు లోకి వచ్చాడు. ఈ సమయం లో కొద్దిగా స్కోరు మందగించింది. కొద్దీ సేపట్లోనే ధావన్ తన మెరుపులు మొదలు పెట్టాడు. 25 వ ఓవర్లో కౌల్టర్‌నైల్‌ వేసిన  తొలి బంతికి ధావన్‌ ఔట్‌ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. బంతి గబ్బర్‌ శరీరాన్ని తాకి నేరుగా వికెట్‌కీపర్‌ కారే చేతిలో పడింది. అటు తరువాత ధావన్‌(84) మళ్లీ జోరు అందుకున్నాడు. జంపా బౌలింగ్‌లో ఈ ఓవర్‌ మూడో బంతిని డీప్‌ ఎక్స్‌ట్రా కవర్‌ మీదుగా బౌండరీకి తరలించాడు. ఆరో బంతికి కూడా అదే రకమైన శిక్ష. దీంతో మొత్తంగా 26 ఓవర్‌లో రెండు బౌండరీలు వచ్చాయి. మరోపక్క కోహ్లీయే నిదానంగా ఆడుతున్నాడు. 27 ఓవర్లు ముగిసే సరికి భారత్ 153 పరుగులతో ఉంది. ధావన్ 84 పరుగులతోనూ, కోహ్లీ 10 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. 


Tags:    

Similar News