చతేశ్వర్ పూజారాకు ఇక బీసీసీఐ A+ కాంట్రాక్టు

టీమిండియా నయావాల్ చతేశ్వర్ పూజారా కష్టానికి తగ్గ ఫలితం దక్కే అవకాశం కనిపిస్తోంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రస్తుత నాలుగు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ మొదటి ఏడు ఇన్నింగ్స్ లో మూడు సెంచరీలతో సహా 521 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచిన పూజారా కు సెంట్రల్ కాంట్రాక్టుల్లో ప్రమోషన్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది.

Update: 2019-01-05 11:07 GMT
Cheteshwar Pujara

టీమిండియా నయావాల్ చతేశ్వర్ పూజారా కష్టానికి తగ్గ ఫలితం దక్కే అవకాశం కనిపిస్తోంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రస్తుత నాలుగు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ మొదటి ఏడు ఇన్నింగ్స్ లో మూడు సెంచరీలతో సహా 521 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచిన పూజారా కు సెంట్రల్ కాంట్రాక్టుల్లో ప్రమోషన్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇప్పటి వరకూ A- గ్రేడ్ కాంట్రాక్టుతో ఏడాదికి 5 కోట్ల రూపాయలు మాత్రమే అందుకొంటున్న పూజారా వచ్చే సీజన్ నుంచి A + కాంట్రాక్టుతో 7కోట్ల రూపాయలు అందుకోనున్నాడు. ప్రస్తుతం A+ కాంట్రాక్టులో కెప్టెన్ కొహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్యా రహానే, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, జస్ ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ మాత్రమే ఉన్నారు. ఇప్పుడు పూజారా సైతం వచ్చి వీరి సరసన చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

Similar News