IPLనిర్వ‌హణ‌కు బీసీసీఐ గట్టి ప్ర‌య‌త్నాలు.. విండీస్ ఒప్పుకుంటుందా

IPL: ఐపీఎల్‌ 14వ సీజన్‌ను కరోనా వైరస్‌ కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిన సంగ‌తి తెలిసిందే

Update: 2021-05-30 11:03 GMT

BCCI File Photo

IPL: ఐపీఎల్‌ 14వ సీజన్‌ను కరోనా వైరస్‌ కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిన సంగ‌తి తెలిసిందే. ఐపీఎల్ ఈ ఏడాది యూఏఈలో నిర్వ‌హించ‌నున్నట్లు బీసీసీఐ వెల్ల‌డించింది. ఐపీఎల్ నిర్వ‌హించ‌క‌పోతే మూడువేల కోట్ల వ‌ర‌కు న‌ష్టం వాటిల్లే అవ‌కాశం ఉంది. దీంంతో ఎలాగైనా ఐపీఎల్ నిర్వ‌హించాల‌ని బీసీసీఐ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. సెప్టెంబర్‌ 15 తర్వాత మిగిలిన మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అందుకు సంబంధించిన ప్రణాళికలు రూపొందిస్తూనే ముందుకు సాగుతోంది.

ఈ నేపథ్యంలోనే సీపీఎల్‌ను కాస్త ముందుగా నిర్వహించాలని ఆ బోర్డుతో సంప్రదింపులు చేస్తోంది. ఈ క్రమంలోనే కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సీపీఎల్‌)ను వారం పది రోజులు ముందుకు జరపాలని విండీస్‌ క్రికెట్‌ బోర్డును సంప్రదించే పనిలో పడింది భారత క్రికెట్‌ బోర్డు. సెప్టెంబర్‌ 18 నుంచి అక్టోబర్‌ 10లోపు మిగిలిన మ్యాచ్‌లు పూర్తి చేయాలని తాజాగా జరిగిన స్పెషల్‌ జనరల్‌ మీటింగ్‌లో బీసీసీఐ తీర్మానించింది. సీపీఎల్‌ 9వ సీజన్‌ను ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్‌ 19 వరకు నిర్వహించాలని విండీస్‌ క్రికెట్‌ బోర్డు ఇది వరకే తేదీలను ఖరారు చేసింది. అయితే విండీస్‌ ఆటగాళ్లు యూఏఈకి చేరుకున్నాక మూడు రోజుల క్వారంటైన్‌ గడువు కూడా కలిసొస్తుందని బీసీసీఐ భావిస్తోంది.

ఆ జాబితాలో కీరన్‌ పొలార్డ్‌, క్రిస్‌గేల్‌, డ్వేన్‌ బ్రావో, షిమ్రన్‌ హెట్‌మైర్‌, జేసన్‌ హోల్డర్‌, నికోలస్‌ పూరన్‌, ఫాబియన్‌ అలెన్‌, కీమో పాల్‌, సునీల్‌ నరైన్‌ లాంటి ఆటగాళ్లు ఉన్నారు. ముఖ్యంగా ఆటగాళ్లను ఒక బుడగ నుంచి మరో బుడగలోకి తరలించడం తేలికవుతుందని, అలాగే ఒకవేళ ఈ చర్చలు విఫలమై.. విండీస్‌ బోర్డు తమ తేదీల్లో మార్పులు చేసుకోకపోతే.. విండీస్‌ కీలక ఆటగాళ్లు ఐపీఎల్‌ ప్రారంభమయ్యాక కొన్ని మ్యాచ్‌లు ఆడలేని పరిస్థితి ఏర్పడుతుంది.ఈ క్రమంలోనే విండీస్‌ బోర్డును ఒప్పించే పనిలో పడిందని ఓ అధికారి చెప్పారు. 

Tags:    

Similar News