హార్థిక్ పాండ్యాకు బీసీసీఐ షాక్

ఆస్ట్రేలియాతో తీన్మార్ వన్డే సిరీస్ ప్రారంభానికి కొద్దిగంటల ముందే టీమిండియా యువఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా, ఓపెనర్ కెఎల్ రాహుల్ లపై బీసీసీఐ రెండుమ్యాచ్ ల నిషేధం విధించింది.

Update: 2019-01-11 05:44 GMT
Hardik Pandya

ఆస్ట్రేలియాతో తీన్మార్ వన్డే సిరీస్ ప్రారంభానికి కొద్దిగంటల ముందే టీమిండియా యువఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా, ఓపెనర్ కెఎల్ రాహుల్ లపై బీసీసీఐ రెండుమ్యాచ్ ల నిషేధం విధించింది. కాఫీ విత్ కరణ్ షోలో ఓపెనర్ రాహుల్ తో కలసి పాల్గొన్న హార్ధిక్ పాండ్యా యువతులతో తన సంబంధాల గురించి వివరిస్తూ అనుచిత వ్యాఖ్యలను చేయటం వివాదంగా మారింది. సోషల్ మీడియాలో పాండ్యా వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రఅభ్యంతరం వ్యక్తం చేశారు.

దీంతో పాండ్యా, రాహుల్ లకు 24 గంటలలోగా వివరణ ఇవ్వాలంటూ బీసీసీఐ షోకాజ్ నోటీస్ జారీ చేయటం, బదులుగా క్షమాపణలు వేడుకొంటూ హార్థిక్ పాండ్యా సమాధానం ఇవ్వటం జరిగిపోయాయి. అయితే హార్థిక్ పాండ్యా ఇచ్చిన జవాబులో తమకు చిత్తశుద్ధి, పశ్చాతాపం ఏమాత్రం కనిపించలేదని రెండు మ్యాచ్ ల నిషేధం విధించినట్లు బీసీసీఐ పాలకమండలి చైర్మన్ వినోద్ రాయ్ ప్రకటించారు. ఒకవేళ ప్రస్తుత వన్డే సిరీస్ లోనే పాండ్యాపై నిషేధం అమలు చేస్తే రెండు వన్డేలు ఆడే అవకాశంతో పాటు మ్యాచ్ ఫీజుగా 14 లక్షల రూపాయలు నష్టపోడం ఖాయంగా కనిపిస్తోంది. భారత క్రికెటర్ గా ఉండి హుందాగా మాట్లాడటం రాని హార్థిక్ పాండ్యాను కఠినంగా శిక్షించాలంటూ పలువురు ప్రముఖులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Similar News