నిలకడగా సాగుతున్న బంగ్లాదేశ్ ఇన్నింగ్స్

Update: 2019-06-24 11:45 GMT

అఫంగనిస్తాన్ తో జరుగుతున్నా వరల్డ్ కప్ టోర్నీ మ్యాచ్ లో బంగ్లాదేశ్ నిలకడగా పరుగులు సాధిస్తోంది. అయితే ఈ క్రమం లో మూడు వికెట్లను చేజార్చుకుంది. షకిబ్‌ , తమీమ్‌ బాధ్యతగా ఆడుతూ స్కోరు బోర్డును నిదానంగా పరుగులెత్తించారు. అయితే, 17 వ ఓవర్లో   నబీ  కీలకమైన వికెట్‌ తీశాడు. చివరి బంతిని ఆడబోయిన తమీమ్‌ ఇక్బాల్‌ (36; 53 బంతుల్లో)  క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. తరువాత వచ్చిన రహీమ్‌ తో కలసి షకీబ్ చక్కని సమన్వయంతో ఆడాడు. ఈ క్రమంలో షకీబ్ ప్రపంచకప్‌లో 1000 పరుగులు సాధించాడు. బంగ్లాదేశ్ జట్టులో వెయ్యి పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 28 వ ఓవర్లో షకీబ్ తన అర్థశతకాని సాధించాడు. కానీ, తరువాతి ఓవర్లోనే ముజీబ్‌ వేసిన బంతికి ఎల్బీ గా పెవిలియన్ చేరాడు. మొత్తమ్మీద 30 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్ మూడు వికెట్లకు 143 పరుగులు చేసింది. సౌమ్య సర్కార్‌ (0), రహీమ్‌ (33) క్రీజులో ఉన్నారు.



Tags:    

Similar News