రషీద్‌ ఖాన్‌ ఇంట విషాదం

Update: 2020-06-19 07:03 GMT

అఫ్ఘాన్ స్పిన్నర్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు రషీద్‌ ఖాన్‌ ఇంట విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యం కారణంగా అతని తల్లి మరణించింది. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు రషీద్ ఖాన్. అమ్మా.. నువ్వే నా సర్వసం. నువ్వు లేకుండా నేను లేను. ఇక నాతో ఉండవనే విషయాన్ని జీర్ణీంచుకోలేకపోతున్నా. నిన్ను చాలా మిస్సవుతానమ్మా. నీ ఆత్మకు శాంతికలగాలి అంటూ రషీద్‌ ట్వీట్ చేశాడు.

ఇటీవల తన తల్లి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. ఆమె కోసం ప్రార్థనలు చేయాలని అభిమానుల్ని రషీద్ ఖాన్ కోరిన విషయం తెలిసిందే. రషీద్‌ తల్లి మరణవార్త తెలుసుకున్న పలువురు క్రికెటర్లు సోషల్‌ మీడియా వేదికగా తమ సంతాపం తెలుపుతున్నారు. 



 



Tags:    

Similar News