Religious News: ఏ రాశివారు ఏ దైవాన్ని పూజించాలి.. దీనివల్ల కలిగే ప్రయోజనాలు..!

Religious News: హిందూ సంప్రదాయం ప్రకారం మూడు కోట్ల మంది దేవతలు ఉంటారు. కానీ ఆరాధించే పద్దతులు వేర్వేరుగా ఉంటాయి.

Update: 2023-09-05 01:30 GMT

Religious News: ఏ రాశివారు ఏ దైవాన్ని పూజించాలి.. దీనివల్ల కలిగే ప్రయోజనాలు..!

Religious News: హిందూ సంప్రదాయం ప్రకారం మూడు కోట్ల మంది దేవతలు ఉంటారు. కానీ ఆరాధించే పద్దతులు వేర్వేరుగా ఉంటాయి. భక్తులు ఏ దేవుడిని పూజించినా ఒక్కటే ఎందుకంటే వారి కష్టాలు తొలగిపోవడానికి, మోక్షం లభించడానికి మాత్రమే చేస్తారు. అయితే జ్యోతిష్యశాస్త్ర ప్రకారం దృష్టా రాశుల ప్రకారం వ్యక్తులకి ప్రత్యేక దేవతలు ఉంటారు. వీరిని ఆరాధించడం వల్ల త్వరగా కోరికలు తీరే అవకాశాలు ఉంటాయి. అయితే ఏ రాశివారు ఏ దైవాన్ని ఆరాధించాలో ఈరోజు తెలుసుకుందాం.

ముందుగా మేషరాశికి అధిపతి కుజుడు. ఈ రాశి వారు సుబ్రహ్మణ్యుడు, దుర్గాదేవిని పూజించడం వల్ల అన్నివిధాలా కలసివస్తుంది. వృషభరాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశి వారు శ్రీకృష్ణుని పూజించాలి. మిథున రాశికి అధిపతి బుధుడు. ఈరాశివారు ఆరాధించవలసిన దైవము శ్రీ మహావిష్ణువు. కర్మాటక రాశికి అధిపతి చంద్రుడు. ఈరాశి వారు ఆరాధించవలసిన దైవము శివుడు. సింహరాశికి అధిపతి రవి. ఈరాశి వారు సూర్యారాధన చేయడం మంచింది.

కన్యారాశికి అధిపతి బుధుడు. ఈ రాశివారు ఆరాధించవలసిన దైవము శ్రీ వేంకటేశ్వర స్వామి. తులారాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశి వారు ఆరాధించవలసిన దైవము లక్ష్మీదేవి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఈ రాశి వారు సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధించడం, దుర్గాదేవిని పూజించడం వల్ల అన్ని విధాల కలసివస్తుంది. ధనూరాశికి అధిపతి గురుడు. ఈ రాశి వారు దత్తాత్రేయుని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి.

మకర రాశికి అధిపతి శని. ఈ రాశి వారు ఆరాధించవలసినటువంటి దైవం వేంకటేశ్వరస్వామి.కుంభరాశికి అధిపతి శని. ఈ రాశి వారు ఆరాధించవలసిన దైవం ఆంజనేయస్వామి. మీనరాశికి అధిపతి బృహస్పతి. ఈ రాశివారు దక్షిణామూర్తిని పూజించడం, ఆరాధించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ఆయా రాశులవారు ఆయా రాశులని బట్టి ఆలయాలని సందర్శిస్తే నిత్యం మంచి జరిగే అవకాశాలు ఉంటాయి.

Tags:    

Similar News