Vaastu Tips: ఏ దిశలో కూర్చుని భోజనం చేయాలి.. ఫలితాలు ఎలా ఉంటాయి..?

Vaastu Tips: వాస్తు ప్రకారం భోజనం చేయడంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి.

Update: 2023-08-14 14:30 GMT

Vaastu Tips: ఏ దిశలో కూర్చుని భోజనం చేయాలి.. ఫలితాలు ఎలా ఉంటాయి..?

Vaastu Tips: వాస్తు ప్రకారం భోజనం చేయడంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. కొంతమంది ఈ విషయాన్ని పట్టించుకోరు కానీ ఇందులో కూడా కొన్ని వాస్తవాలు దాగి ఉన్నాయి. ఎందుకంటే ఇది కుటుంబ ఆర్థిక పురోగాభివృద్ధికి సంబంధించిన విషయం. వాస్తుని పాటించే చాలామందికి ఏ దిక్కున కూర్చొని భోజనం చేయాలనే సందేహం ఉంటుంది. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

వాస్తు ప్రకారం స్థలం కొన్నా, ఇల్లు కొన్నా దాని మధ్య భాగంలో కూర్చొని దానికున్నటువంటి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కులను గమనించాలి. అలా వ్యక్తి లోపల కూర్చుని వాస్తును చూసేటప్పుడు సూర్యుడు ఎదురుగా ఉంటే ఆ దిక్కును తూర్పుగా, మిగతా దిక్కులను యదావిధిగా స్థాపన చేసుకొని వాస్తుని పరిశీలిస్తారు. ఇలా ఒక ఇంటిని, స్థలాన్ని చూసినప్పుడు మంచి చెడులు తెలుస్తాయి. ఏవైనా లోపాలు ఉంటే పరిహారాలు చేయాల్సి ఉంటుంది.

భోజనం చేసే దిశ

వాస్తు ప్రకారం భోజనాన్ని తీసుకునేటప్పుడు ఆరోగ్యము, సౌఖ్యము, తృప్తి కలగాలంటే తూర్పు వైపు కూర్చుని భోజనము చేయమని శాస్త్రం చెబుతోంది. అభివృద్ధి, లాభము, కోరిన కోర్కెలు నెరవేరడానికి ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయాలని శాస్త్రం చెబుతోంది. తూర్పు లేదా ఉత్తర ముఖాలలో భోజనాన్ని ఆచరించాలి. కానీ పడమర దక్షిణ ముఖాలలో భోజనాన్ని ఆచరిస్తే సమస్యలు, నష్టములు, అనారోగ్యము సంభవిస్తాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి.

Tags:    

Similar News