Ugadi 2023: పంచాంగ శ్రవణం వల్ల లాభమేంటి.. పెద్దలు ఎందుకు పాటిస్తారో తెలుసుకోండి..!

Ugadi 2023: ఈ ఏడాది మార్చి 22 వ తేదీన శ్రీ శోభకృత్ నామ సంవత్సరంగా ఉగాది పండగ వస్తుంది.

Update: 2023-03-20 03:30 GMT

Ugadi 2023: పంచాంగ శ్రవణం వల్ల లాభమేంటి.. పెద్దలు ఎందుకు పాటిస్తారో తెలుసుకోండి..!

Ugadi 2023: ఈ ఏడాది మార్చి 22 వ తేదీన శ్రీ శోభకృత్ నామ సంవత్సరంగా ఉగాది పండగ వస్తుంది. ప్రతి సంవత్సరం ఉగాదిని చైత్రశుద్ధ పాడ్యమి రోజున నిర్వహిస్తారు. దీనినే తెలుగుసంవత్సరాది అని కూడా పిలుస్తారు. ఉగాదిరోజున ప్రంచాంగ శ్రవణం చేయడం ఆనవాయితీ. పలు దేవాలయాల్లో బ్రాహ్మణులు పంచాంగ శ్రవణం , కవి సమ్మేళనాలు నిర్వహిస్తారు. తిథి, వార, నక్షత్రాలతో కూడుకున్న పంచాంగాన్ని వినడం వల్ల ఆ సంవత్సరాన్ని ప్రణాళికాబద్ధంగా రూపొందించుకునే అవకాశం ఉంటుంది.

పంచాంగం అనేది పంచ, అంగ అనే రెండు పదాల నుంచి పుట్టింది. ఇది రాశి, నక్షత్రం, తిథి, యోగం, కరణం అనే ఐదు అంశాల గురించి తెలియజేస్తుంది. హిందూ పండుగలు, శుభ ముహూర్తాల గురించి వివరణాత్మక సమాచారం అందిస్తుంది. మనిషి ఏదైనా చెడు చేస్తే ఆ ఫలితాన్ని కచ్చితంగా అనుభవించాలి. ఇలాంటి కర్మ ఫలితాలని నెరవేర్చుకోవడానికి పంచాంగ శ్రవణం మనిషికి తోడ్పడుతుంది. దైవాన్ని ప్రసన్నం చేసుకోవడానికి దారిచూపుతుంది.

మన జీవితం ఎలా సాగుతుందో మనలో ఎవరికీ తెలియదు. సమయం ప్రభావం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఎవరు ఎవరికోసం వేచి ఉండరు. సమయానుసారం కాలానుగుణంగా అన్ని జరిగిపోతుంటాయి. పంచాంగం అనేది జ్యోతిషశాస్త్ర సమాచారాన్ని కలిగి ఉంటుంది. ఇది గణనలను రాశి, నక్షత్రం, తిథి, యోగం, కరణంలను బట్టి భవిష్యత్ ను తెలియజేస్తుంది. దీనిని బట్టి మానవులకి జీవితంలో వారు చేయాల్సిన పనులేంటో బోధపడుతుంది.

ఉగాది చైత్రశుద్ధ పాడ్యమిన వచ్చే పండుగ. 'ఉగము' అనగా నక్షత్ర గమనం అని అర్థం. 'ఉగాది' నుంచి నక్షత్ర గమనమును లెక్కిస్తారు. ఈ రోజున తలంటు స్నానం చేసి, వేపపువ్వు పచ్చడిని ఈశ్వరుడికి నివేదన చేసి ఆరగించాలి. సుఖ దుఃఖాలను సమానంగా స్వీకరించాలనే ఆంతర్యం ఆ పచ్చడిలో దాగి ఉంటుంది. శిశిరం తర్వాత వచ్చే నెల చైత్రం. పన్నెండు మాసాలలో శిశిరం చివరిది. అది ఆకురాలు కాలం. చైత్రం కొత్త చిగుళ్లు వేసే మాసం. మానవాళి కూడా తమకు జరిగిన మంచిని జ్ఞాపకాలుగా ఉంచుకొని, మిగిలిన సంఘటనలను చెట్లు తమ ఆకులు రాల్చుకున్నట్లుగా దులిపేసుకొని కొత్త ఆశయాలతో నూతన కాంతులతో చిగురించడమే ఉగాది పండుగ ప్రాశస్త్యం.

Tags:    

Similar News