Sri Rama Navami 2023: పూజా శుభ ముహూర్తాలు ఇవే.. మీ ఆత్మీయులకు శుభ సందేశాలు పంపించండి ఇలా!

Sri Rama Navami 2023: శ్రీరామనవమి' హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ.

Update: 2023-03-30 00:30 GMT

Sri Rama Navami 2023: పూజా శుభ ముహూర్తాలు ఇవే.. మిత్రులకు శుభాకాంక్షలు ఇలా తెలపండి..

Sri Rama Navami 2023: శ్రీరామనవమి' హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. అంతేకాదు.. శ్రీరాముడు సీతాదేవిల కళ్యాణం జరిగింది చైత్ర శుద్ధ నవమి రోజునే.. ఇక శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనది చైత్ర శుద్ధ నవమి నాడు.. ఇంతటి విశిష్టత కలిగి యున్న చైత్ర మాసం తొమ్మిదో రోజున శ్రీరామ నవమిగా హిందువులు అత్యంత ఘనంగా జరుపుకుంటారు.

ఈ ఏడాది శ్రీరామ నవమి పండుగను మార్చి 30 న జరుపుకోనున్నాం.. రామనవమి పూజకు ఉత్తమ పూజా ముహూర్తం మధ్యం ఉంది. నవమి తిథి మార్చి 29, 2023 రాత్రి 09:07 గంటలకు ప్రారంభమై, 2023 మార్చి 30 రాత్రి 11:30 గంటలకు ముగుస్తుంది. శ్రీరామనవమి పూజా కార్యక్రమాలను నిర్వహించడానికి మధ్యకాలం అత్యంత పవిత్రమైన సమయమని పూజారులు చెబుతున్నారు.

ముఖ్యంగా శ్రీరామనవమిరోజు వడపప్పు తయారు చేసి స్వామివారికి నివేదించాలి. రామాయణగాథ ఏదైనా చదువుకోవాలి. సీతారాములు ఆదర్శదంపతులు అందుకే ఈ ఒక్కరోజైనా భార్యభర్తలు పోట్లాడుకోకుండా ఉండాలి. కల్యాణ తలంబ్రాలు భద్రంగా దాచుకుంటారు. ఎవరైనా పెళ్లి సమయంలో తలంబ్రాల్లో సీతారాముల తలంబ్రాలు కొన్ని కలిపినా వారి దాంపత్యంలో ఏ లోటు ఉండదు. రాముడి ఆశీస్సులు ఉంటాయి.

శ్రీ రామ నవమి రోజున భక్తులు ఒకరోజు ఉపవాసం ఉండి, శ్రీ రాముడిని భక్తి శ్రద్ధలతో పూజించాలి, రామ నామ జపం చేస్తూ ఆరాధించాలి. రామాయణ పఠనం గానీ, శ్రవణం గానీ చేయాలి. శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడం, రామనవమి వేడుకలలో పాల్గొనడం చేయడం చేసి మరుసటి రోజున ఉపవాసం విరమిస్తే సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

మిత్రులకు శుభాకాంక్షలు ఇలా తెలపండి

మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు

బంధుమిత్రులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు

మిత్రులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు

అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు,

శ్రీరామనవమి శుభాకాంక్షలు

Delete Edit


Tags:    

Similar News