Makar Sankranti 2024: మకర సంక్రాంతి రోజు వీటిని తినాలి.. ఇంకా దానం చేయాలి..!

Makar Sankranti 2024: హిందువులు జరుపుకునే ముఖ్యమైన పెద్ద పండుగలలో సంక్రాంతి ఒకటి. శాస్త్రీయపరంగా ఈ పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది.

Update: 2024-01-13 01:30 GMT

Makar Sankranti 2024: మకర సంక్రాంతి రోజు వీటిని తినాలి.. ఇంకా దానం చేయాలి..!

Makar Sankranti 2024: హిందువులు జరుపుకునే ముఖ్యమైన పెద్ద పండుగలలో సంక్రాంతి ఒకటి. శాస్త్రీయపరంగా ఈ పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మకర సంక్రాంతిని భారతదేశం అంతటా 15 జనవరి 2024న జరుపుకుంటారు. ఈ పండుగ పంటలు, సూర్యుడు, శనిగ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. మకర సంక్రాంతి రోజు నువ్వులకి సంబంధించిన కొన్ని పనులు చేయడం వల్ల అదృష్టాన్ని పొందవచ్చు. మకర సంక్రాంతిని ఉత్తరాయణం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే దీని తరువాత సూర్యుడు ఉత్తర దిశలో కదులుతూ ఉంటాడు.

నువ్వులతో పాటు బెల్లం, కిచిడీ, దానధర్మాలకు కూడా ఈ రోజు ప్రాముఖ్యత ఉంది. ఈ మూడు పదార్థాలు లేకుండా మకర సంక్రాంతి పండుగ అసంపూర్తి అని పెద్దలు చెబుతారు. మకర సంక్రాంతి రోజు నువ్వులు, బెల్లం, కిచిడీలను తినడం దానం చేయడం చాలా మంచిది. వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

కిచిడీ ప్రాముఖ్యత

మకర సంక్రాంతి రోజున ఖిచ్డీని తినాలి. ఎందుకంటే దీనిని నవధాన్యాలతో తయారుచేస్తారు. దీనివల్ల నవగ్రహ ఆశీర్వాదం లభిస్తుందని నమ్మకం. అంతేకాకుండా ఆరోగ్యంగా ఉండే వరం కూడా లభిస్తుందని నమ్మకం. ఖిచ్డీలో కలిపిన నవధాన్యాలు నవగ్రహాలతో సంబంధం కలిగి ఉంటాయని గ్రంథాల్లో చెప్పారు.

బియ్యం- ఖిచ్డీలో బియ్యం ముఖ్యమైనది. ఇది చంద్రుడు, శుక్రుడి శుభాలను పొందడానికి ప్రయోజనకరంగా ఉంటుంది.

నెయ్యి - ఖిచ్డీ నెయ్యి లేకుండా అసంపూర్తిగా ఉంటుంది. సూర్యుడు నెయ్యికి సంబంధించినవాడు. దీని ద్వారా సూర్యుని అనుగ్రహం లభిస్తుంది.

పసుపు - పసుపు బృహస్పతిని సూచిస్తుంది.

కందిపప్పు - ఖిచ్డీలో కందిపప్పు కలిపి తినడం వల్ల శని, రాహు, కేతువుల అశుభాలు తగ్గుతాయి.

పెసరపప్పు- చాలా మంది ప్రజలు మకర సంక్రాంతి రోజు పెసరపప్పు, పచ్చి కూరగాయలు, బియ్యం మిశ్రమంతో ఖిచ్డీని తయారు చేస్తారు. పెసరపప్పు, ఆకుపచ్చ కూరగాయలు మెర్క్యురీకి సంబంధించినవి.

బెల్లం - ఖిచ్డీతో తిన్న బెల్లం అంగారక గ్రహంర, సూర్యుని చిహ్నంగా చెబుతారు.

బెల్లం, నువ్వుల ప్రాముఖ్యత

ముఖ్యంగా నల్ల నువ్వులు, బెల్లంతో చేసిన పదార్థాలు దానం చేయడం వల్ల శనిదేవుడు, సూర్య భగవానుడి ఆశీర్వాదాలు లభిస్తాయి. నల్ల నువ్వులు శనికి సంబంధించినవి. బెల్లం సూర్యుని చిహ్నం. మకర సంక్రాంతి రోజు సూర్యభగవానుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే ఈ రోజున బెల్లం తినడం, దానం చేయడం వల్ల గౌరవం పెరుగుతుంది. సూర్యుని దయతో, వృత్తిలో ప్రయోజనాలు పొందుతారు. బెల్లం, నువ్వులు వేడెక్కించే గుణాలను కలిగి ఉంటాయి. చలి ప్రభావం నుంచి రక్షించడంలో సహాయపడుతాయి. ఈ రెండింటిని తినడం వల్ల శరీరానికి వెచ్చదనం లభిస్తుంది.

Tags:    

Similar News