Sunset Puja Rules: సూర్యాస్తమయంలో ఈ తప్పులు చేయవద్దు.. దురదృష్టం కోరి తెచ్చుకోవద్దు..!
Sunset Puja Rules: హిందూమతం ప్రకారం ప్రతి పనిని సమయానుసారంగా చేయాలి.
Sunset Puja Rules: సూర్యాస్తమయంలో ఈ తప్పులు చేయవద్దు.. దురదృష్టం కోరి తెచ్చుకోవద్దు..!
Sunset Puja Rules: హిందూమతం ప్రకారం ప్రతి పనిని సమయానుసారంగా చేయాలి. రోజు ప్రారంభంలో చేసే పనులు సూర్యోదయంలో రోజు ముగింపులో చేసే పనులు సూర్యాస్తమయంలో చేయాలని పెద్దల అభిప్రాయం. ఈ నియమాలని పాటించని వ్యక్తులు జీవితంలో చాలా కష్టాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంట్లో సుఖ శాంతులు, శాంతి సౌభాగ్యాలు నెలకొనాలంటే సూర్యాస్తమయంలో పొరపాటున కూడా కొన్ని పనులని చేయకూడదు. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.
హిందూమతం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఉతకకూడదు. దీనివల్ల వారిలోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. దీని కారణంగా సదరు వ్యక్తి దురదృష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. అలాగే సూర్యాస్తమయంలో ఒక వ్యక్తి ఎప్పుడూ నిద్రపోకూడదు. జబ్బుపడినవారు, పిల్లలు మినహాయించి ఆరోగ్యంగా ఉండే వ్యక్తులు ఈ సమయంలో అస్సలు నిద్రపోకూడదు. ఒకవేళ దీనిని విస్మరిస్తే వారి ఇంట్లో ధనం నిలవదు.హిందూ ధర్మం ప్రకారం సూర్యాస్తమయంలో ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు తప్పనిసరిగా ఏదైనా తీసుకురావాలి. ఖాళీ చేతులతో రావడం పెద్ద దోషంగా పరిగణిస్తారు.
సూర్యాస్తమయం తర్వాత పొరపాటున కూడా గోర్లు, జుట్టును కత్తిరించుకోకూడదు. ఈ నియమాన్ని విస్మరించిన వారు డబ్బు కొరత, అప్పుల సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. హిందువులు చెట్లు, మొక్కలని దేవతలుగా పూజిస్తారు. సూర్యాస్తమయం తర్వాత చెట్ల ఆకులు, కొమ్మలు మొదలైన వాటిని విరగొట్టడం చేయకూడదు. హిందువుల విశ్వాసం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత చనిపోయిన వ్యక్తిని దహనం చేయరు. గరుడ పురాణం ప్రకారం ఈ నియమాన్ని విస్మరిస్తే చనిపోయిన వ్యక్తి ఆత్మ శాంతిని పొందదు.
సనాతన సంప్రదాయం ప్రకారం లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందడానికి ఒక వ్యక్తి సాయంత్రం తన ఇంటి ప్రవేశద్వారం, ఇంటి మూలల్లో దీపాలను వెలిగించాలి. సూర్యాస్తమయం సమయంలో తులసి చెట్టు దగ్గర స్వచ్ఛమైన నెయ్యి దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మాత్రమే కాదు నారాయణుడి అనుగ్రహం లభిస్తుంది.