Ugadi Special 2024: ఉగాది రోజు ఏ పనులు చేయాలి.. ఏ పనులు చేయకూడదు..!

Ugadi Special 2024: తెలుగువారి మొదటి పండుగ ఉగాది. అందుకే దీనిని తెలుగు సంవత్సరాది అని పిలుస్తారు.

Update: 2024-04-08 07:00 GMT

Ugadi Special 2024: ఉగాది రోజు ఏ పనులు చేయాలి.. ఏ పనులు చేయకూడదు..!

Ugadi Special 2024: తెలుగువారి మొదటి పండుగ ఉగాది. అందుకే దీనిని తెలుగు సంవత్సరాది అని పిలుస్తారు. ఈ రోజున అందరూ ఉగాది పచ్చడి తాగి రోజువారీ పనులు మొదలుపెడుతారు. “ఉగ” అంటే నక్షత్ర గమనం లేదా జన్మ, ఆయుష్షు అని అర్థం. వీటికి ఆది ఉగాది. అంటే ప్రపంచంలోని జనుల ఆయుష్షుకు మొదటిరోజు ఉగాది. ఉగస్య ఆది అనేదే ఉగాది. ఇంకొక విధంగా చెప్పాలంటే 'యుగం' అనగా రెండు లేక జంట అని అర్ధం. ఉత్తరాయణ, దక్షిణాయణాల ద్వయ సంయుతం యుగం (సంవత్సరం) కాగా ఆ యుగానికి ఆది ఉగాది అయింది. ఈ రోజున ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదో తెలుసుకుందాం.

ఉగాది రోజున చేయాల్సిన పనులు

ఉగాది రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి శరీరానికి, తలకు నువ్వులనూనె రాసుకుని, సున్నిపిండి పెట్టుకుని స్నానం చేయాలి. కొత్త బట్టలు ధరించి దేవుడిని ఆరాధించి సూర్య నమస్కారం చేయాలి. ఉగాది రోజున పేదలకు ధన, ధాన్యాలు దానం చేస్తే విశేష కీర్తి లభిస్తుంది. ఉగాది రోజున దమనేన పూజ చేయాలి. చైత్ర శుక్ల పాడ్యమి రోజున బ్రహ్మకు, విదియ రోజున శివునికి, తదియ రోజున గౌరీ శంకరులకు, చతుర్థి రోజున వినాయకుడికి ఇలా పౌర్ణమి వరకు దేవుళ్లకు పూజలు చేయాలి.ఉగాది రోజున వినాయకుడిని, నవగ్రహాలను, బ్రహ్మదేవతలను పూజించాలని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి.

ఉగాది పచ్చడి

ఉగాది రోజున కచ్చితంగా పచ్చడి చేయాలి. ఈ పచ్చడికి నవగ్రహాలకు సంబంధం ఉంటుంది. ఉగాది పచ్చడిలోని తీపికి గురుడు, ఉప్పుకు చంద్రుడు, కారానికి కుజుడు, మిరియాల పొడికి రవి, పులుపుకి శుక్రుడు అన్ని రుచులు కలిపిన వారికి శని, బుధ గ్రహాలు కారకులవుతారని పండితులు చెబుతున్నారు.

చేయకూడని పనులు

ఉగాది రోజు బద్దకంగా ఉండకూడదు. ఆలస్యంగా నిద్ర లేవడం మంచిది కాదు. ఈ పర్వదినాన ఆల్కహాల్, సిగరేట్, మాంసాహారాలు ముట్టకూడదు. ముఖ్యంగా పంచాంగ శ్రవణాన్ని దక్షిణం ముఖాన కూర్చొని చేయకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవీ అనుగ్రహం ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ఉగాది రోజు మనం ఏ పనిచేస్తామో సంవత్సరం మొత్తం అవే పనులు చేస్తామని పెద్దల నమ్మకం. కాబట్టి ఈ రోజు మంచి పనులు చేయడానికి ప్రయత్నించాలి.

Tags:    

Similar News