Vastu Tips: వాస్తు ప్రకారం ఉత్తర దిశలో ఈ వస్తువులు అస్సలు ఉంచవద్దు..!
Vastu Tips: వాస్తు శాస్త్రంలో దిశలకు ప్రత్యేక స్థానం ఉంది.
Vastu Tips: వాస్తు ప్రకారం ఉత్తర దిశలో ఈ వస్తువులు అస్సలు ఉంచవద్దు..!
Vastu Tips: వాస్తు శాస్త్రంలో దిశలకు ప్రత్యేక స్థానం ఉంది. మొత్తం 4 దిశలు ఉత్తరం, పశ్చిమం, తూర్పు, దక్షిణం. ఇవి కాకుండా ఈశాన్యం , ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం అనే 4 ఉప దిశలు కూడా ఉంటాయి. వాస్తు శాస్త్రంలో అన్ని దిశలకు సంబంధించి కొన్ని నియమాలు ఉంటాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఉత్తర దిశని కుబేరుడు, లక్ష్మి దేవి దిక్కుగా భావిస్తారు. ఈ దిశ నుంచి పాజిటివ్ శక్తి ప్రవేశిస్తుంది. ఈ కారణంగా ఈ దిశను ఆరాధన, జపం, యోగాభ్యాసానికి సముచితమైనదిగా భావిస్తారు. అయితే ఉత్తర దిశలో ఉండకూడని వస్తువులు ఏంటో ఈ రోజు తెలుసుకుందాం.
టాయిలెట్
ఉత్తర దిశ నుంచి పాజిటివ్ శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందుకే ఇల్లు కట్టేటప్పుడు ఉత్తరం వైపు మరుగుదొడ్లు నిర్మించకూడదు. ఇది అతిపెద్ద వాస్తులోపంగా చెబుతారు. ఉత్తర దిశలో మరుగుదొడ్డి ఉన్న ఇళ్లలో ఆర్థిక సమస్యలు ఉంటాయి. ఈ వాస్తు దోషం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు. మీ ఇంటికి ఉత్తర దిశలో మరుగుదొడ్డి ఉంటే ఒక గ్లాస్ కప్పులో ఉప్పు నింపి బాత్రూమ్ మూలలో పెట్టాలి. ఆపై దానిని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. ఈ పరిహారంతో వాస్తుదోషం తొలగిపోతుంది.
బూట్లు, చెప్పులు
కుబేరుడు, తల్లి లక్ష్మి ఉత్తర దిశలో నివసిస్తుందని నమ్ముతారు. కుబేరుడు సంపద, ఆనందం ప్రసాదించే దేవుడుగా చెబుతారు. ఈ పరిస్థితిలో బూట్లు, చెప్పులు ఈ దిశలో ఉంచకూడదు. ఉత్తర దిశలో ఇవి ఉండటం వల్ల కెరీర్‌లో ఆటంకాలు ఎదురవుతాయి.
బరువైన వస్తువులను
వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిశలో బరువైన వస్తువులను ఉంచవద్దు. ఇది పాజిటివ్ శక్తిని అడ్డుకుంటుంది. లక్ష్మి అనుగ్రహం పొందడానికి ఈ దిశ ఖాళీగా ఉంచాలి.
డస్ట్ బిన్
ఉత్తర దిశలో డస్ట్‌బిన్ ఉంచకూడదు. అలాగే విరిగిన వస్తువులను పెట్టకూడదు. అయితే ఈ దిశలో డబ్బు, ఖజానా, పిల్లల రీడింగ్ టేబుల్ ఉంచడం శ్రేయస్కరం.