Kamika Ekadashi 2025: జూలై 21 కామిక ఏకాదశి.. ఆధ్యాత్మిక శుభదినం, పూజా విశిష్టతలు ఇవే!
Kamika Ekadashi 2025: ఈ ఏడాది కామిక ఏకాదశి జూలై 21వ తేదీన జరగనుంది. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఇది అత్యంత పవిత్రమైన రోజుగా భావించబడుతోంది. ఇది ఆషాఢ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిగా గుర్తించబడింది
Kamika Ekadashi 2025: జూలై 21 కామిక ఏకాదశి.. ఆధ్యాత్మిక శుభదినం, పూజా విశిష్టతలు ఇవే!
Kamika Ekadashi 2025: ఈ ఏడాది కామిక ఏకాదశి జూలై 21వ తేదీన జరగనుంది. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఇది అత్యంత పవిత్రమైన రోజుగా భావించబడుతోంది. ఇది ఆషాఢ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిగా గుర్తించబడింది. చాతుర్మాసం ప్రారంభమైన తర్వాత వచ్చే మొదటి ఏకాదశి కావడంతో దీనికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది.
విశిష్టత ఏమిటి?
పురాణాలు చెబుతున్న దాని ప్రకారం, కామిక ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు మరియు లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే, పాపాల నివారణతో పాటు ఆర్థిక కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం. ఈరోజు ఉపవాసం పాటించడం వల్ల ఆత్మశుద్ధి మరియు పుణ్యఫలాల లాభం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు.
ఎలా ఆచరించాలి?
♦ ఉదయం స్నానం చేసి ఇంటిని శుభ్రం చేయాలి.
♦ పూజ గదిలో వ్రత సంకల్పం చేసి ఉపవాసాన్ని ప్రారంభించాలి.
♦ విష్ణుమూర్తి పటానికి లేదా విగ్రహానికి పంచామృత అభిషేకం చేయాలి.
♦ తులసి దళాలతో పూజ చేసి, “నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్రాన్ని జపించాలి.
♦ విష్ణు సహస్రనామ పారాయణం, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించడం శుభ ఫలితాన్నిస్తుంది.
శివ పూజ
♦ ఈ ఏడాది కామిక ఏకాదశి సోమవారం నాడు రావడంతో, శివుని పూజ చేయడం కూడా శుభప్రదంగా భావిస్తున్నారు.
♦ శివలింగానికి అభిషేకం చేసి మారేడు పూలు, జమ్మి ఆకులు, ఉమ్మెత్త పూలు సమర్పించాలి.
♦ “ఓం నమః శివాయ” మంత్రాన్ని జపించడం వల్ల శివుని కృప లభిస్తుంది.
దానం చేయడం వల్ల పుణ్యం:
♦ ఆవు లేదా దూడ దానం చేయడం,
♦ తులసి మొక్కను పూజించడం,
♦ పేదలకు అన్నదానం లేదా వస్త్రదానం చేయడం వల్ల పుణ్యఫలం పొందుతారని పెద్దలు చెబుతున్నారు.