Kailash Mansarovar Yatra 2025: కైలాస మానస సరోవర్ యాత్ర.. భక్తులు ఎలా సిద్ధం కావాలి? రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇదే
Kailash Mansarovar Yatra 2025: కైలాస మానస సరోవర్ యాత్ర అనేది భక్తులకే కాదు, శరీరానికీ, మనసుకూ ఒక గట్టి పరీక్ష. ఈ పవిత్ర యాత్రలో భాగంగా భక్తులు తక్కువ ఆక్సిజన్, అధిక ఎత్తు వంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది.
Kailash Mansarovar Yatra 2025: కైలాస మానస సరోవర్ యాత్ర.. భక్తులు ఎలా సిద్ధం కావాలి? రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇదే
Kailash Mansarovar Yatra 2025: కైలాస మానస సరోవర్ యాత్ర అనేది భక్తులకే కాదు, శరీరానికీ, మనసుకూ ఒక గట్టి పరీక్ష. ఈ పవిత్ర యాత్రలో భాగంగా భక్తులు తక్కువ ఆక్సిజన్, అధిక ఎత్తు వంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రత్యేక అనుమతులు, మెరుగైన శారీరక స్థితి, పూసిపోసిన ప్లానింగ్ – ఇవన్నీ ఈ యాత్రకు ఎంతో అవసరం.
ఎత్తు ఎంత ఉందంటే...
కైలాస పర్వతం సముద్ర మట్టానికి దాదాపు 21,778 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది లాసా (12,000 అడుగులు) కంటే రెండు రెట్లు ఎక్కువ. ఈ ఎత్తులో ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉండటంతో శ్వాస సంబంధిత ఇబ్బందులు రావడం సర్వసాధారణం. కాబట్టి ముందస్తుగా శరీరాన్ని అలాంటి వాతావరణానికి తగ్గించుకోవడం చాలా ముఖ్యం.
యాత్రకు ముందు చేయవలసిన ముఖ్యమైన సన్నాహాలు
అనుమతులు & రిజిస్ట్రేషన్ తప్పనిసరి
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో మీ పేరును ముందుగానే నమోదు చేసుకోవాలి.
చైనా ప్రభుత్వం నుంచి వీసా పొందాలి.
చెల్లుబాటు అయ్యే ID ప్రూఫ్, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తప్పనిసరి.
పాస్‌పోర్ట్ గడువు
సెప్టెంబర్ 1, 2025 నాటికి మీ భారతీయ పాస్‌పోర్ట్‌కు కనీసం 6 నెలల గడువు ఉండాలి.
వైద్య పరీక్షలు తప్పనిసరి
ఢిల్లీలో ప్రభుత్వ వైద్య బృందం ద్వారా మెడికల్ టెస్టులు నిర్వహిస్తారు.
శారీరకంగా పూర్తిగా ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఉంది.
తయారీగా తీసుకెళ్లాల్సిన వస్తువులు
వెచ్చని బట్టలు, రెయిన్ కోట్
టార్చ్, గ్లాసెస్, చేతి తొడుగులు
సౌకర్యవంతమైన షూస్, పవర్ బ్యాంక్
అవసరమైన మందులు, టోపీ
ఈ ఆరోగ్య సమస్యలుంటే జాగ్రత్త!
గుండె సంబంధిత వ్యాధులు
డయాబెటిస్
ఆర్థరైటిస్
శ్వాస సంబంధిత సమస్యలు
ఈ సమస్యలు ఉన్నవారు ఈ యాత్రను నివారించగలిగితే మంచిది.
మూడు ప్రధాన దశలు
మానస సరోవర్ సరస్సు చేరుకోవడం
అక్కడి నుంచి కైలాస పర్వతం వైపు పయనం
పవిత్ర పర్వతాన్ని చుట్టూ పరిక్రమ చేయడం
ఈ పయనంలో దైవ సాన్నిధ్యాన్ని అనుభవించాలంటే, శరీరికంగా మరియు మానసికంగా పూర్తిగా సిద్ధంగా ఉండాలి.
ఈసారి కైలాస యాత్ర చేయాలనుకుంటున్నారా?
ముందుగా శాంతంగా, పూర్తి సమాచారం తీసుకుని, ఆరోగ్యాన్ని పరీక్షించుకొని... ఆనందకరమైన, భక్తిపూరితమైన యాత్రకు సిద్ధమవండి!