History of chandi Temple : అతిపురాతన చండీ ఆలయం

History of chandi Temple : భారత దేశంలోని ఎప్పుడైనా ఆధ్యాత్మిక ప్రదేశాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు అందరికీ ముందుగా గుర్తొచ్చే ప్రదేశం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్.

Update: 2020-08-10 05:00 GMT
చండీ ఆలయం

History of chandi Temple : భారత దేశంలోని ఎప్పుడైనా ఆధ్యాత్మిక ప్రదేశాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు అందరికీ ముందుగా గుర్తొచ్చే ప్రదేశం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్. ఈ క్షేత్రం హిందువుల మొదటి పర్యాటక కేంద్రంగా ఎప్పుడూ నిలుస్తుంది. దేశంలో యాత్రికులు ఇష్టపడే ప్రముఖ ప్రదేశం కావడంతో హరిద్వార్ లో సాధారణంగా పర్యాటక ఆకర్షణలుగా ఆలయాలు, ఆశ్రమాలు నిలుస్తాయి. ముఖ్యంగా ఈ హరిద్వార్ లో ముఖ్యమైన దేవాలయాలలో చండీదేవి ఆలయం ఒకటి. ఈ ఆలయం భారతదేశం లోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హరిద్వార్ జిల్లా లోని హరిద్వార్ నగరంలోని హిందూ దేవాలయం. ఈ దేవాలయం హిమాలయ దక్షిణ ప్రాంతంలో గల శివాలిక్ పర్వతాల లోని నీల పర్వతం పై కొలువుంది. ఈ దేవాలయం 1929 లో కాశ్మీర్ రాజు అయిన సుచాన్ సింగ్ చే నిర్మింపబదినది. అయినప్పటికీ ఈ ఆలయంలోని ప్రధాన దైవం అయిన "చండీ దేవి" యొక్క విగ్రహాన్ని 8 వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు నెలకొల్పినట్లు చారిత్రకుల అభిప్రాయం. ఈ దేవాలయం హరిద్వార్ లోని పంచతీర్థాలలో ఒకటైన "నీల పర్వత తీర్థం"గా కూడా పిలువబదుతోంది.

ఈ చండి దేవి ఆలయం భక్తులు తమ కోరికలు నెరవేర్చుకొనుటకు కొలిచే "సిద్ధ పీఠం"గా పూజింపబడుతోంది. ఇది హరిద్వార్ లో గల మూడు శక్తి పీఠాలలో ఒకటిగా అలరాలుతుంది. ఇది కాక హరిద్వార్ లో గల ముఖ్యమైన శక్తి పీఠాలుగా అలరాలుతున్నవి మాయాదేవి దేవాలయం, మానసదేవీ ఆలయం.

చండీ దేవి..

చండీ దేవత హిందూ దేవతలలో చండిక గా కూడా పిలువబడుతోంది. ఈ చండిక యొక్క కథ విషయానికొస్తే పూర్వకాలంలో "శుంభ", నిశుంభ" అనే రాక్షస రాజులు దేవతల రాజధాని అయిన స్వర్గాన్ని ఆక్రమించారు. ఇంద్రుడిని, దేవతలను స్వర్గం నుండి వెళ్లగొడతారు. దేవతల ప్రార్థనలను విన్న పార్వతి వారి రక్షణార్థం చండిగా అవతరించింది. ఆమె సౌందర్యానికి మోహించిన శుంభుడు ఆమెను వివాహమాడాలని కోరుకుంటాడు. ఆమె వ్యతిరేకిస్తుంది. ఆమె తిరస్కారాన్ని ఆగ్రహించిన శుంభుడు రాక్షస సేనాదిపతులైన "చండ", "ముండ" లను ఆమెను హతమార్చుటకు పంపిస్తాడు. వారు ఆమె క్రోధం నుండి జనించిన చాముండి ద్వారా హతులౌతారు. శుంభ, నిశుంభులు కలసి చండికను హతమార్చాలని ప్రయత్నిస్తారు కాని ఆమె చేతిలో మరణిస్తారు. వారిని వధించిన తర్వాత చండిక కొంతసేపు నీల్ పర్వతం పై విశ్రమించినట్లు పురాణ కథనం. అందువలన ఆ ప్రదేశంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ ప్రాంతంలో గల రెండు పర్వత శిఖరాల పేర్లు "శుంభ", "నిశుంభ".

ఆలయ విశేషాలు..

ఈ దేవాలయం హర్ కీ పౌరికి 4 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ దేవాలయానికి చేరుటకు చండీఘాట్ నుండి మూడు కిలోమీటర్ల పర్వతారోహణ మార్గం ఉంది. ఈ మార్గంలో పర్వతం అధిరోహించుటకు అనేక మెట్లు కూడుకొని ఉంటాయి. ఈ దేవాలయానికి వెళ్ళుటకు "రోప్ వే" మార్గం కూడా ఉంది. ఈ "రోప్ వే" సేవలు మాసనదేవి ఆలయం నుండి యాత్రికులను ఈ దేవాలయానికి చేరవేయుటకు "చండీదేవి ఉదంఖతోల" అనే పేరుతో పిలువబడుతోంది. ఈ "రోప్ వే" యాత్రికులను గౌరీశంకర్ దేవాలయం దిగువ స్టేషను నుండి చండీదేవి దేవాలయం వరకు 2,900 మీటర్లు ఎత్తు వరకూ ఉంటుంది. ఈ రోప్ వే యొక్క పొడవు సుమారు 740 మీటర్ల, ఎత్తు 208 మీటర్లు ఉంటుంది. ఈ పర్వతం రెండవవైపు దట్టమైన అడవి ఉంటుంది. ఈ రోప్ వే పై ప్రయాణిస్తున్నపుడు గంగా నది, హరిద్వార్ లను చూడవచ్చు. ఈ ఆలయం సాధారణ రోజులలో ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరవవడుతోంది. ఈ దేవాలయంలో "ఆర్తి" ఉదయం 5.30 గంటలకు ప్రారంభమవుతుంది.

గుర్తింపు

ఈ దేవాలయం భారత దేశములోని ప్రాచీన దేవాలయాలలో ఒకటిగా గుర్తింపబడింది. ఈ దేవాలయానికి అనేక మంది భక్తులు సందర్శిస్తూంటారు. ముఖ్యంగా చండీ చౌడాస్, నవరాత్రి ఉత్సవం, కుంభమేళా లలో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. హరిద్వార్ సందర్శించే యాత్రికులు తప్పనిసరిగా దర్శించవలసిన దేవాలయం ఇది.

ఈ దేవాలయానికి అతి దగ్గరగా హనుమంతుని తల్లియైన "అంజన" దేవాలయం ఉంది. నీల పర్వతం క్రింది భాగంలో "నీలేశ్వర్ దేవాలయం" ఉంది. పార్వతీ దేవి రూపాలైన "మానస", "చండీ"లు ఎల్లప్పుడూ కలసి ఉండేవారని ఇక్కడి ప్రజల విశ్వాసం. అందువలన మానస దేవాలయం నీల పర్వతానికి ఎదురుగా ఉన్న బిల్వ పర్వతం పై కొలువైనది. ఇదే విధంగా హర్యానా లోని పంచుకుల ప్రాంతంలో మాతా మానస దేవి మందిరం, చండీఘర్ సమీపంలోని చండీ దేవాలయం కూడా ఒకే ప్రాంతంలో ఉండటం ఈ దేవతా రూపాలు కలసి ఉండేవి అనుటకు నిదర్శనం.




Tags:    

Similar News