Ugadi 2023: ఉగాది రోజు ఈ వస్తువులని ఇంటికి తెస్తే మీ అదృష్టం రెట్టింపు..!

Ugadi 2023: చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగ వస్తుంది.

Update: 2023-03-22 04:30 GMT

Ugadi 2023: ఉగాది రోజు ఈ వస్తువులని ఇంటికి తెస్తే మీ అదృష్టం రెట్టింపు..!

Ugadi 2023: చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగ వస్తుంది. ఈ సంవత్సరం ప్రజలు శ్రీ శోభకృత్ నామ సంవత్సరంగా ఉగాది పండగను జరుపుకుంటున్నారు. ఉగాది అంటే కొత్తయుగం ప్రారంభం అని అర్థం. ఈరోజున పంచాంగం వినడంతో పాటు కొన్ని పనులు చేస్తే ఏడాది మొత్తం శుభ ఫలితాలు ఉంటాయి. గృహస్తులు ఇంటికి అవసరమైన కొత్త వస్తువులను కొనుక్కోవడం వల్ల అదృష్టం కలిసివస్తుంది. ఆ వస్తువుల గురించి ఈరోజు తెలుసుకుందాం.

లోహపు తాబేలు

వాస్తు ప్రకారం ఉగాది రోజున లోహపు తాబేలును ఇంట్లోకి తీసుకురావడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఇంట్లోకి పాజిటివ్‌ ఎనర్జీ ప్రసరిస్తుంది. ఇది దుష్ట శక్తులను నాశనం చేస్తుంది. దీంతో ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటాయి.

లాఫింగ్ బుద్ధ

వాస్తు ప్రకారం ఉగాది రోజున లాఫింగ్ బుద్ధని ఇంట్లోకి తీసుకువస్తే చాలా మంచిది. దీనిని ఈశాన్య దిశలో పెట్టాలి. దీనివల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడుతారు.

ముత్యాల శంఖం

వాస్తు ప్రకారం ఉగాది రోజు ముత్యాల శంఖం ఇంట్లోకి తెస్తే అన్ని శుభాలు కలుగుతాయి. ఇంట్లో ధనం స్థిరంగా ఉంటుంది. శంఖువు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఉగాది రోజు ముత్యాల శంఖుని కొనుగోలు చేస్తే ఏడాది మొత్తం మంచి ఫలితాలు పొందవచ్చు.

చిన్న కొబ్బరికాయ

వాస్తు ప్రకారం చిన్న కొబ్బరికాయను ఇంటికి తెచ్చి దానిని ఎర్రటి గుడ్డలో చుట్టి బీరువాలో పెట్టుకోవాలి. దీని వల్ల ఇంట్లో సుఖశాంతులు నిలవడమే కాకుండా ధనానికి ఎలాంటి లోటు ఉండదు. మిగతావి కొంచెం ఖరీదు కావొచ్చు కానీ కొబ్బరికాయ సులువుగానే దొరుకుతుంది. దీనిని చేస్తే ఏడాది మొత్తం మంచి ఫలితాలు చూస్తారు.

తులసి మొక్కను

వాస్తుప్రకారం ఏ ఇంట్లో అయితే తులసి మొక్క ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీమాతా వస్తుందని నమ్మకంక. అందుకే ఉగాది రోజున ఇంటికి తులసి మొక్కని తీసుకురండి. దీన్ని ఇంట్లో ఉంచడం వల్ల పాజిటివ్‌ ఎనర్జీ ఇంట్లో ప్రసరిస్తుంది.

Tags:    

Similar News