Bible Quotes in Telugu: క్రిస్మస్ 2025 పండుగ వేళ.. పవిత్రమైన బైబిల్ వాక్యాలు
Bible Quotes in Telugu: బైబిల్ అనేది కేవలం ఒక గ్రంథం మాత్రమే కాదు.. అది మానవ జీవితానికి మార్గదర్శకమైన జ్ఞాన భాండాగారం అని విశ్వాసులు భావిస్తారు.
Bible Quotes in Telugu: క్రిస్మస్ 2025 పండుగ వేళ.. పవిత్రమైన బైబిల్ వాక్యాలు
Bible Quotes in Telugu: బైబిల్ అనేది కేవలం ఒక గ్రంథం మాత్రమే కాదు.. అది మానవ జీవితానికి మార్గదర్శకమైన జ్ఞాన భాండాగారం అని విశ్వాసులు భావిస్తారు. అందులోని వాక్యాలు ఆధ్యాత్మికతను పెంపొందిస్తూ, సత్యం వైపు నడిపిస్తూ తరతరాలుగా ప్రజలకు ప్రేరణగా నిలుస్తున్నాయి. మనిషికి ఆత్మవిశ్వాసం, సృజనాత్మకతను అందిస్తూ, సరైన దారిలో నడవడానికి దోహదపడతాయని నమ్మకం ఉంది.
డిసెంబర్ 25న జరుపుకునే క్రిస్మస్ 2025 సందర్భంగా జీవిత గమనంలో నిత్యం ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన బైబిల్ వాక్యాలను ఇప్పుడు తెలుసుకుందాం…
పవిత్రమైన బైబిల్ వాక్యాలు
♦ యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి.. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు.
♦ నా కృప నీకు చాలును.. బలహీనతయందు నా బలము పరిపూర్ణమగును.
♦ నీ హృదయ వాంఛను ఆయన నీకు అనుగ్రహించు గాక.. నీ ఆలోచనలన్నింటినీ సఫలపరుచు గాక.
♦ ఒకడు తన హృదయములో త్రోవను యోచించుకొనును.. అయితే యెహోవా వాని అడుగులను స్థిరపరుచును.
♦ దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు?
♦ నీ హృదయమును అన్నింటికంటే జాగ్రత్తగా కాపాడుకొనుము.. అన్నీ జీవధారలు దానిలోనే పుట్టును.
♦ నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును.
ఈ వాక్యాలు మన జీవితానికి దైవిక బలం, ధైర్యం, ఆశలను అందిస్తాయని విశ్వాసులు చెబుతున్నారు.
ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వీటిని ఎంతవరకు విశ్వసించాలన్నది వ్యక్తిగత అభిప్రాయం.