Guru Gochar: భరణి నక్షత్రంలోకి బృహస్పతి ఎంట్రీ.. ఈ 3 రాశుల వారికి ఆకస్మిక ధనంతోపాటు అదృష్టం..!
Astrology: రాహువు అశ్వనీ నక్షత్రంలో ఎంట్రీ ఇచ్చాడు. దీని వల్ల అన్ని రాశులపై అశుభ ప్రభావం పడింది. కానీ, బృహస్పతి భరణి నక్షత్రంలో ప్రవేశించడం వల్ల 3 రాశుల వారికి ఆకస్మిక ధనాన్ని, అదృష్టాన్ని పొందే అవకాశం ఉంది.
Guru Gochar: భరణి నక్షత్రంలోకి బృహస్పతి ఎంట్రీ.. ఈ 3 రాశుల వారికి ఆకస్మిక ధనంతోపాటు అదృష్టం..!
Astrology: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, గ్రహాలు రాశులను ఎప్పటికప్పుడు మారుస్తుంటాయి. దీని ప్రభావం మానవ జీవితంపై కనిపిస్తుంది. బృహస్పతి అశ్వనీ నక్షత్రాన్ని విడిచిపెట్టి భరణి నక్షత్రంలోకి ప్రవేశించబోతోంది. దీంతో కొన్ని రాశుల వారి జీవితాల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
రాహువు అశ్వనీ నక్షత్రంలో ఉన్నాడు. దీని వల్ల అన్ని రాశులపై అశుభ ప్రభావం పడింది. కానీ, బృహస్పతి భరణి నక్షత్రంలో ప్రవేశించడం వల్ల 3 రాశుల వారికి ఆకస్మిక ధనాన్ని, అదృష్టాన్ని పొందే అవకాశం ఉంది. ఈ అదృష్ట రాశులు ఏంటో చూద్దాం..
మేష రాశి..
బృహస్పతి రాశి మార్పు మేష రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశితో లగ్న గృహంలో బృహస్పతి, రాహువు కలయిక ఉంది. తద్వారా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీంతో ఈ రాశి వారు పని, వ్యాపారంలో విజయం సాధిస్తారు. దీనితో పాటు ధనలాభం కూడా కలుగుతుంది. మరోవైపు, అవివాహితులైన వారికి వివాహ ప్రతిపాదన రావొచ్చు. దీంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఈ సమయంలో మీరు మీ కుటుంబం కోసం చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. జీవిత భాగస్వామి సహకారం అందుతుంది.
మిథున రాశి..
బృహస్పతి రాశి మార్పు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే రాహువు, బృహస్పతి కలయిక మీ సంచార జాతకంలో 11వ ఇంట్లో జరుగుతోంది. అందుకే వ్యాపారస్తులు ఈ సమయంలో మంచి లాభాలు పొందగలరు. అక్కడ కొత్త ఆదాయ వనరులను సృష్టించుకోవచ్చు. దీంతో పాటు పిల్లల సంతోషం కూడా పెరుగుతుంది. మిత్రులతో సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. అదే సమయంలో మీరు వాహనం, ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయవచ్చు. అలాగే వ్యాపారస్తులు కూడా లాభపడగలరు. అలాగే కొంతమంది కొత్త వ్యక్తులను కలవాల్సి వస్తుంది.
కర్కాటక రాశి..
బృహస్పతి రాశి మార్పు కర్కాటకరాశి వారికి అనుకూలంగా ఉంటుందని నిరూపించవచ్చు. ఎందుకంటే మీ రాశి నుంచి పదవ ఇంట్లో బృహస్పతి, రాహువుల కలయిక ఏర్పడుతోంది. అందుకే మీ వల్ల జరగని పనులు మొదలవుతాయి. లాభం కూడా ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే నిరుద్యోగులు కూడా ఉద్యోగాలు పొందవచ్చు. అదే సమయంలో వ్యాపారంలోనూ లాభాలు పెరుగుతాయి. మీ వ్యాపారం పగటిపూట రెట్టింపు, రాత్రికి నాలుగు రెట్లు పెరుగుతుంది.
(గమపిర: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం జనాల విశ్వాసాలు, సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఇక్కడ అందించాం. ఇది నిజమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.)